వైసీపీలోకి మరో టీడీపీ నేత.. అధినేత బుజ్జగింపు.. ఆగుతారా..?

వైసీపీలోకి మరో టీడీపీ నేత.. అధినేత బుజ్జగింపు.. ఆగుతారా..?
x
Highlights

ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలంటూ నిత్యం ప్రజల్లో గడుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇస్తున్నారు నేతలు. టీడీపీలో సీనియర్ నేత, అందునా మాజీ మంత్రి అయిన...

ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలంటూ నిత్యం ప్రజల్లో గడుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇస్తున్నారు నేతలు. టీడీపీలో సీనియర్ నేత, అందునా మాజీ మంత్రి అయిన తనకు గుర్తింపు లేదంటూ ఆనం రామ నారాయణరెడ్డి వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఆనం వైసీపీలో చేరుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు ధృవీకరించాయి. వచ్చే నెల 2 వ తేదీన ఆనం వైసీపీలో చేరతారని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. నిన్న(శుక్రవారం) గోవర్ధన్‌రెడ్డి ఆనం నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక తేదీ ఇతర అంశాలపై చర్చించారు. విశాఖపట్నంలో జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం నెల్లూరులో బహిరంగ సభ జరపాలని ఆనం రామనారాయణ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు అయన పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో ఆనం నిర్ణయంలో మళ్ళీ ఏమైనా మార్పు ఉంటుందా అన్న సందేహం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories