చంద్ర‌బాబుకు అమిత్ షా కౌంట‌ర్

చంద్ర‌బాబుకు అమిత్ షా కౌంట‌ర్
x
Highlights

టీడీపీ - బీజేపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాష్ట్రానికి మీరేం చేశారంటే మీరేం చేశారని ఒక‌రికొక‌రు ప్ర‌శ్నించుకుంటూ రాజ‌కీయ మంట‌ను...

టీడీపీ - బీజేపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాష్ట్రానికి మీరేం చేశారంటే మీరేం చేశారని ఒక‌రికొక‌రు ప్ర‌శ్నించుకుంటూ రాజ‌కీయ మంట‌ను ర‌గ‌లిస్తున్నారు. అంతేకాదు బీజేపీ చేసిన ఘ‌న‌కార్యం వ‌ల్లే పొత్తునుండి విడిపోయామ‌ని టీడీపీ అంటుంటే అందుకు కౌంట‌ర్ గా రాష్ట్రానికి తాము ఏం చేశామే చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది బీజేపీ.
ఈ నేప‌థ్యంలో టీడీపీకి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కౌంట‌ర్ ఇవ్వ‌నున్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై స‌హ‌క‌రించ‌నందున ఎన్డీఏ తో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు ఓ లేఖ రాశారు. ఆ లేఖకు అమిత్ షా కౌంట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.
ఏపీకి ప్ర‌త్యేక‌హోదాపై టీడీపీ - వైసీపీ నేత‌లు పార్ల‌మెంట్ లో పోటా పోటీగా తమ పోరాటాన్ని ప్ర‌జ‌ల‌కు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీజేపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఏపీ రాష్ట్రానికి ఏం చేశామనే విషయాన్ని చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు.
లోక్ స‌భ వాయిదా ప‌డిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ హ‌రిబాబు టీడీపీ పై మండిప‌డ్డారు. ఎన్నికల కోసమే కేంద్రంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందని సూచించారు.
టీడీపీ త‌మ‌పై చేస్తున్న ఆరోపణ‌లకు స‌రైన స‌మాధానం చెప్పాలంటే వారు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రావాల‌ని అన్నారు . అప్పుడే తాము రాష్ట్రానికి ఏం చేశామ‌ని స్ప‌ష్టం చేస్తామ‌ని అంటున్నారు. అయితే అవిశ్వాసం సభలో చర్చకు వస్తోందా, రాదా అనే విషయమై సభ జరిగే తీరుపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ, టిడిపిలు వ్యూహరచనలో భాగంగానే ఈ అంశాన్ని తీసుకొన్నాయని హరిబాబు ఆరోపించారు
కాగా గురువారం నాడు సీఎం చంద్ర‌బాబు రాసిన లేఖ‌కు అమిత్ షా స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నారు. భ‌విష్య‌త్తులో చేసే సహయం కూడ ప్రస్తావించనున్నారు ఇప్పటివరకు ఏపీ రాష్ట్రానికి చేసిన సహయంతో పాటు రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రానికి చేయాల్సిన సహయానికి సంబంధించిన విషయాలపై తన లేఖలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తావించే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories