అందుకే ఆమెనుంచి విడాకులు తీసుకున్నా : ఆమిర్‌ ఖాన్‌

అందుకే ఆమెనుంచి విడాకులు తీసుకున్నా : ఆమిర్‌ ఖాన్‌
x
Highlights

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌. ఇటీవల.. కరణ్‌ జోహార్‌ చాట్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమిర్‌ మాట్లాడుతూ.. తన మాజీ భార్య రీనాకు...

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌. ఇటీవల.. కరణ్‌ జోహార్‌ చాట్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమిర్‌ మాట్లాడుతూ.. తన మాజీ భార్య రీనాకు విడాకులు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలు వెల్లడించాడు. 'నా మాజీ భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చినంత మాత్రాన తనపై నాకు గౌరవం లేనట్లు కాదు. మేము విడిపోయే సమయంలో మా రెండు కుటుంబాలు కూడా చాలా బాధ పడ్డాయి. కానీ దమతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక కలిసి ఉండటంలో అర్థం లేదు. ఆమెపై నాకున్న ప్రేమ తగ్గిపోయింది. చాలా చిన్న వయసులోనే మాకు పెళ్లి అయింది బహుశా ఈ కారణం వల్లే అలా జరిగి ఉంటుంది. 16 ఏళ్ల వైవాహిక బంధానికి తెరపడినప్పటికీ, రీనాతో ఇప్పటికీ స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. భార్యాభర్తలుగా విడిపోయామే కానీ స్నేహితులుగా ఎల్లప్పుడూ కలిసే ఉన్నాం, అప్పుడప్పుడు జరిగే సామజిక కార్యక్రమాలు, ఫంక్షన్లలో కలిసి పాల్గొంటాం' చెప్పాడు. కాగా 2002లో రీనాతో విడాకుల అనంతరం ఆమిర్‌ ఖాన్‌.. 2005లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ రావును ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories