హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్ లో యువ‌తిపై వేధింపులు

హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్ లో యువ‌తిపై వేధింపులు
x
Highlights

హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్ లో ఓ యువ‌తి వేధింపుల‌కు గురైంది. అమీర్ పేట్ మెట్రోస్టేష‌న్ ఉద్యోగి నితిన్ స్టేష‌న్ లిఫ్ట్ లో ఉన్న‌ ఓ యువ‌తితో అస‌భ్యంగా...

హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్ లో ఓ యువ‌తి వేధింపుల‌కు గురైంది. అమీర్ పేట్ మెట్రోస్టేష‌న్ ఉద్యోగి నితిన్ స్టేష‌న్ లిఫ్ట్ లో ఉన్న‌ ఓ యువ‌తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ సంఘ‌ట‌న పై హ‌తాశురాలైన యువ‌తి ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడ్ని శిక్షించాల‌ని డిమాండ్ చేస్తోంది.
ఇదిలా ఉంటే గ‌తఏడాది హ‌ట్ట‌హాసంగా ప్రారంభమైన మెట్రోస్టేష‌న్ ఇప్పుడు ప్ర‌యాణికులు లేక వెల‌వెల‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మొద‌ట్లో న‌గ‌ర వాసులు ట్రాఫిక్ క‌ష్టాల‌నుంచి బ‌య‌ట‌పడేందుకు మెట్రోను ఆశ్రయించారు. దీంతో తొలి రెండు నెల‌ల్లో రోజుకు ల‌క్ష‌మందికి పైగా ప్ర‌యాణం చేయ‌గా ..రాను రాను ప్ర‌యాణించే వారు క‌రువ‌య్యాయి. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని , అందుకే తాము మెట్రోలో ప్రయాణించేందుకు విముఖ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు.
మొద‌ట్లో మెట్రోజోష్, జాయ్ రైడ్, ట్రాఫిక్ నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు మెట్రో ప్ర‌యాణం చేసిన‌ట్లు తెలిపారు. అయితే దూర ప్రాంతాల‌కు ప్ర‌యాణం చేసే ఉద్యోగులు సైతం ఇప్పుడు బ‌స్సుల్లో ప్ర‌యాణం చేస్తున్నారు.
మెట్రోలో ప్రయాణించాలంటే స‌మ‌య‌పాల‌న త‌ప్ప‌నిస‌రి. కానీ మెట్రో రైలు ప్ర‌యాణించే తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. స‌మ‌య‌పాల‌న లేక‌పోవ‌డం ఎక్క‌డంటే అక్క‌డే గంట‌ల త‌ర‌బ‌డి ఆగిపోవ‌డం, ఛార్జిలు అధికం, నెల‌వారి బ‌స్సు పాసులు లేక‌పోవ‌డం, మెట్రో క‌న్నా బ‌స్ పాస్ చార్జీలు త‌క్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌యాణికులు మెట్రో ఎక్కేందుకు ఆస‌క్తిని వ్య‌క్తం చేయ‌డం లేదు. దీంతో ఏం చేయాలో పాలు పోని సంబంధిత అధికారులు మెట్రోస్టేష‌న్ ల్లో ప్ర‌యాణికుల్ని ఆక‌ర్షించేందుకు స్టాళ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఆ స్టాళ్లు నిర్మాణం త‌రువ‌తా ప్ర‌యాణికులు పెరుగుతారో లేదో వేచే చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories