అమెజాన్ లో కొలువుల జాత‌ర‌

అమెజాన్ లో కొలువుల జాత‌ర‌
x
Highlights

ప్ర‌ముఖ ఇ- కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ లో తాత్కాలిక కొలువుల జాత‌ర మొద‌లైంది. జనవరి 20-24 తేదీల మధ్య అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా సేల్‌’‌ను నిర్వహించనుంది. ఈ...

ప్ర‌ముఖ ఇ- కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ లో తాత్కాలిక కొలువుల జాత‌ర మొద‌లైంది. జనవరి 20-24 తేదీల మధ్య అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా సేల్‌’‌ను నిర్వహించనుంది. ఈ సేల్ లో వినియోగ‌దారులు త‌మ‌కు కావాల్సిన వ‌స్తువుల్ని ఆర్డ‌ర్ చేస్తుంటారు. అలా ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువులు వినియోగ‌దారుడికి అందేలా చూసే బాధ్య‌త ఉద్యోగుల‌పై ఉంది.అందుకోసం దాదాపు 5,500మందిని తాత్కాలికంగా రిక్రూట్ చేసుకోనున్న‌ట్లు అమెజాన్‌ ఇండియా ఉపాధ్యక్షుడు (కస్టమర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌)అఖిల్‌ సక్సేనా తెలిపారు. హైదరాబాద్‌, బెంగళూరు సహా అన్ని మెట్రో నగరాల్లో ఈ నియమాకాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. అమెజాన్‌ ఇండియాకు దేశవ్యాప్తంగా 41 నిర్వహణ కేంద్రాలు, 25 సార్టేషన్‌ సెంటర్లు, సుమారు 150 డెలివరీ కేంద్రాలు, 350 సర్వీస్‌ పార్టనర్‌ కేంద్రాలు ఉన్నాయి.
వినియోగ‌దారుల సేవా కేంద్రాల‌లో 1000మంది అసోసియేట్లు
డెలివ‌రీ స్టేష‌న్ల‌లో - 5,500 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories