ఎంఐఎం శాసనసభాపక్షనేతగా అక్బరుద్దీన్

ఎంఐఎం శాసనసభాపక్షనేతగా అక్బరుద్దీన్
x
Highlights

ఇటీవల తెలంగాణ ఎన్నికలు ముగిసి.. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం 7 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. అయితే ఎంఐఎం పార్టీ తమ శాసనసభాపక్ష...

ఇటీవల తెలంగాణ ఎన్నికలు ముగిసి.. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం
7 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. అయితే ఎంఐఎం పార్టీ తమ శాసనసభాపక్ష నేతగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని ఎన్నుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎంఐఎం రాష్ట్ర కార్యాలయం దారుస్సలాంలో అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన ఈరోజు పార్టీ కార్యనిర్వాహక కమీటి భేటీ జరిగింది. ఈ సమావేశంలో శాసనసభాపక్షనేతగా అక్బరుద్దీన్ ను ఎన్నుకున్నారు. 2009 , 2014 లో కూడా అక్బరుద్దీన్‌ ఒవైసీ పార్టీ తరుపున శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడోసారి అసెంబ్లీలో శాసనసభాపక్షనేతగా అక్బర్ వ్యవహరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories