రెండోరోజు క‌లెక్ష‌న్లు...పాపం గుడ్లు తేలేస్తున్నారు

రెండోరోజు క‌లెక్ష‌న్లు...పాపం గుడ్లు తేలేస్తున్నారు
x
Highlights

డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ ల కాంబినేషన్ లో వ‌చ్చిన‌ అజ్ఞాతవాసి భారీ స్థాయిలో విడుదలైన విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు...

డైర‌క్ట‌ర్ త్రివిక్ర‌మ్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ ల కాంబినేషన్ లో వ‌చ్చిన‌ అజ్ఞాతవాసి భారీ స్థాయిలో విడుదలైన విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ఆ రికార్డ్ క్రాస్ చేస్తుంది. బాహుబ‌లి రికార్డుల‌ను క్రాస్ చేస్తుంద‌ని అభిమానులు తెగ‌హ‌డావిడి చేశారు. తీరా సినిమా విడుద‌ల త‌రువాత అంచ‌నాలు త‌ల్ల‌కిందుల‌య్యాయి. త్రివిక్ర‌మ్ కాపీ కంటెంట్ తో తెర‌కెక్కించ‌డం. గ‌తంలో వ‌చ్చిన అత్తారింటికి దారేది తో పోలీ ఉండ‌డంతో మిక్స్ డ్ టాక్ తో స‌రిపెట్టుకుంది. తొలిరోజు వ‌సూళ్లు బాగున్నా రెండు రోజు వ‌సుళ్లతో బ‌య్య‌ర్ల‌కు షాక్ త‌గిలిన‌ట్లు టాక్ . రెండో రోజు ఉదయం ఆట, మ్యాట్నీ వసూళ్లు చూసి బయ్యర్లు గుడ్లు తేలేస్తున్నార‌ని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతానికి మోస్తారు వ‌సూళ్లు వ‌చ్చినా థియేట‌ర్ల‌లో సినిమా సంక్రాతి పండుగ వ‌ర‌కు ఉంటుంద‌ని భావించారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు . ఇక వీరాభిమానులు సైతం ప‌దే ప‌దే చూద్దామ‌న్నా కంటెంట్ లేక‌పోయే స‌రికి లైట్ తీసుకుంటున్నారు. తొలి రోజు నాన్‌ బాహుబలి రికార్డ్ క్రాస్ చేసినా రెండోరోజు క‌లెక్ష‌న్ల‌తో భారీ ఎత్తున న‌ష్ట‌పోయిన‌ట్లు స‌మాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories