సింధూమీన‌న్ కూడా చీటింగ్ చేసిందా

సింధూమీన‌న్ కూడా చీటింగ్ చేసిందా
x
Highlights

చందమామ - వైశాలి సినిమాలతో మెప్పించిన మ‌ళ‌యాళీ ముద్దుగుమ్ము సింధూ మీన‌న్ పై సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బెంగ‌ళూరు ఆర్ ఎంసీ యార్డ్...

చందమామ - వైశాలి సినిమాలతో మెప్పించిన మ‌ళ‌యాళీ ముద్దుగుమ్ము సింధూ మీన‌న్ పై సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
బెంగ‌ళూరు ఆర్ ఎంసీ యార్డ్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో న‌కిలీ ప‌త్రాలు సృష్టించిన సింధూమీన‌న్ రూ. 30ల‌క్ష‌ల రుణం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తీసుకున్న రుణాన్ని చెల్లించ‌కుండా అమెరికాకు పారిపోయిన‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌హిళ‌ల కోసం ప‌నిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో హీరోయిన్ సింధు మీనన్ ఆమె సోదరుడు మనోజ్ కార్తి కేయన్, నాగశ్రీ శివన్న, సుధా రాజశేఖర్ కలిసి నకిలీ పత్రాలు సమర్పించి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వాటిని చెల్లించ‌కుండా అమెరికాలో ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే సింధు మీన‌న్ తీసుకున్న డ‌బ్బులు క‌ట్ట‌లేదంటూ బ్యాంక్ ఆఫ్ బరోడ బ్యాంకు మేనేజర్ రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న బెంగ‌ళూరు పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఈ విచార‌ణ‌లో భాగంగా సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్, మరో మహిళ నాగశ్రీ శివన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ కేసులో దోషిగా ఉన్న‌ సుధా రాజశేఖర్ కోసం గాలిస్తున్నామని బెంగ‌ళూరు డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ అన్నారు. అంతేకాదు చీటింగ్ చేసి సింధుమీన‌న్ అమెరికాలో ఉన్న‌ట్లు ,డీసీసీ చెప్పారు. ఈ కేసులో సింధు మీనన్ కు ప్రమేయం ఉందని వెలుగు చూస్తే చీటింగ్ కేసులో ఆమెను అరెస్టు చేస్తామని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే గ‌తంలో సింధు మీనన్ ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల‌పై స్పందించిన ఆమె కుటుంబ‌స‌భ్యులు సింధు ఆత్మహత్యాయత్నం చేసుకోలేద‌ని .. ఆ వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. సింధు మీనన్ పూర్తి ఆరోగ్యంగా ఉందని, భర్తతో ఆనందంగా కాపురం చేసుకుంటోందని వెల్లడించారు. ఇక తెలుగులో ప‌లు సినిమాలు చేసిన సింధు వెండితెర‌కు గుడ్ బై చెప్పి పెళ్ళి చేసుకుని బ్రిటన్ వెళ్ళిపోయింది. ఇదే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్రిట‌న్ లో ఉండాల్సిన సింధు మీన‌న్ అమెరికాలో ఎందుకు ఉంటున్నార‌నే కోణంలో బెంగ‌ళూరు పోలీసులు విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories