మగవారూ వేధింపులకు గురవుతున్నారు: నటి గౌతమి

మగవారూ వేధింపులకు గురవుతున్నారు: నటి గౌతమి
x
Highlights

దేశంలో వరుసగా అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై సినీ నటి గౌతమి స్పందించారు. మహిళలే కాదు, పురుషులూ కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని అన్నారు....

దేశంలో వరుసగా అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై సినీ నటి గౌతమి స్పందించారు. మహిళలే కాదు, పురుషులూ కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని అన్నారు. దేశంలో అబ్బయిలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని నటీ గౌతమి పేర్కోన్నారు. వీటిపై పూర్తి బాధ్యతలు తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. కేన్సర్‌ బారి నుంచి బయటపడిన అతి కొద్ది మందిలో నటీ గౌతమి ఒకరు. కోవిల్‌ పట్టిలో ఆదివారం జరిగిన కేన్సర్‌పై అవగాహన, యోగా శిక్షణ శిబిరం కార్యక్రమంలో నటీ గౌతమి పాల్గోన్నారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ తనకు క్యాన్సర్ వచ్చినప్పుుడు చాలా సమస్యలు ఎదురయ్యాయని గౌతమి తెలిపారు. కేవలం యోగాసనాల వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను మొగ్గ దశలోనే అడ్డుకున్ననని గౌతమి పేర్కొంది. తాను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం యోగానే అని గౌతమి తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories