న‌ట‌న ప‌రంగా ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావైపోతా

న‌ట‌న ప‌రంగా ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావైపోతా
x
Highlights

టాలీవుడ్ ప్రిన్స్.. యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే.. సౌత్ ఇండియాలోనే కాదు. ఆల్ ఓవర్ ఇండియాలో క్రేజ్ ఉంది. కొందరు బాలీవుడ్ హీరోయిన్లు కూడా మనోడితో...

టాలీవుడ్ ప్రిన్స్.. యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే.. సౌత్ ఇండియాలోనే కాదు. ఆల్ ఓవర్ ఇండియాలో క్రేజ్ ఉంది. కొందరు బాలీవుడ్ హీరోయిన్లు కూడా మనోడితో స్టెప్పులేసేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి హీరోతో ఇప్పటివరకూ నటించే అవకాశాన్ని పొందలేదు కానీ.. మహేష్ ను ఫాలో అవుతున్న హీరోయిన్ ఒకరున్నారు. ఆమే.. అనుపమా పరమేశ్వరన్.

వరుస హిట్లతో.. టాలీవుడ్ లో దూసుకుపోతున్న అనుపమ.. మహేష్ తో కలిసి నటించకున్నా కూడా.. ఆయన రూట్ నే ఫాలో అవుతోంది. శ్రీమంతుడు సినిమాలో.. మహేష్ ఓ డైలాగ్ చెబుతాడు. తిరిగిచ్చేయాలి.. లేకుంటే లావైపోతారు.. అని. బయటికి చెప్పకపోయినా కూడా… ఇప్పుడు అచ్చంగా అదే ఫాలో అవుతూ.. అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది అనుపమ.

తనకు.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత.. ప్రేక్షకుల అభిమానమే అత్యంత ముచ్చట గొలిపిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ మంచి కేరెక్టర్ చేస్తే.. జనాలు ఇంతగా అభిమానిస్తారా? అని ఆశ్చర్యం కూడా కలుగుతుందని వివరించింది. అందుకే.. అంత ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు.. కేరెక్టర్ల రూపంలో.. నటన రూపంలో ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాల్సిందే అని అనుపమ చెబుతోంది.

అంటే.. ఇన్ డైరెక్ట్ గా.. అనుపమ.. మహేష్ ను ఫాలో అవుతున్నట్టే కదా మరి!

Show Full Article
Print Article
Next Story
More Stories