మా బాబు బంగారం

మా బాబు బంగారం
x
Highlights

న‌టుడు శివాజీ ఏపీ ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసేందుకు ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేంద్రం ఏపీ పై ఆప‌రేష‌న్ గ‌రుడ తో టార్గెట్ చేసింద‌ని సంచ‌ల‌న...

న‌టుడు శివాజీ ఏపీ ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసేందుకు ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేంద్రం ఏపీ పై ఆప‌రేష‌న్ గ‌రుడ తో టార్గెట్ చేసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌జ‌ల‌కోసం ఏడాదిగా డేటాను సేక‌రించిన‌ట్లు, ఆ డేటా ఆధారంగా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్త‌మ‌వ్వాల‌ని సూచించిన‌ట్లు చెప్పుకొచ్చారు.
గ‌త నాలుగేళ్లుగా టీడీపీ తో క‌లిసి ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని శివాజీ త‌ప్పుబ‌ట్టారు. గ‌తంలో ప్ర‌శ్నించ‌డానికో పార్టీ అన్న ప‌వ‌న్ ఏపీకి పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చారంటూ చేసిన ప్ర‌సంగం అంద‌రికి న‌చ్చింద‌ని అన్నారు. అయితే గుంటూరు స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హార శైలీలో చాలామార్పులు రావ‌డాన్ని తాను గుర్తించిన‌ట్లు చెప్పారు.
ప్రధాన మంత్రి మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరని చెప్పిన పవన్ .. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రధాని తనతో బాగానే ఉంటారని చెప్పారు. మూడు సంవత్సరాల్లో పవన్ చక్కగా మూడు సినిమాలు చేసుకున్నారు... చక్కగా సంపాదించేసుకున్నారు. మొన్న బహిరంగసభలో లోకేశ్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. ఆధారాలేవని అడిగితే.. ‘బయట అనుకుంటున్నారు' అని పవన్ చెబుతున్నారు. మీరు ఎంత గొప్ప హీరో అయినప్పటికీ, మీరు చెప్పే ప్రతిదానికీ ‘జీ హుజూరు' అనడానికి మేము ఏమైనా పిచ్చోళ్లమా? ప్రశ్నించమని మీరే అన్నారు, అందుకే, ప్రశ్నిస్తున్నాను' అని శివాజీ తేల్చి చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లు అవినీతి పరులు కాదని శివాజీ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. ఇక తాను మాట్లాడితే టీడీపీ కార్య‌క‌ర్త అని బీజేపీ ముద్ర‌వేస్తుంద‌ని గుర్తు చేశారు. నాకు ఏ పార్టీలు, ప‌ద‌వులు అవ‌స‌రంలేదు. అస్త‌త్వం కోసం పోరాటం చేయ‌డంలేద‌ని గుర్తు చేశారు.
టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనందుకే మీకు బీజేపీ, టీడీపీపై ఒకేసారి కోపం వచ్చినట్టుంది అనే ప్రశ్నకు శివాజీ స్పందిస్తూ.. ‘టీటీడీ చైర్మన్ పదవి లేదా టీటీడీ సభ్యుడి పదవి.. కనీసం దర్శనానికి ఓ టికెట్టు ఇవ్వమని కూడా నేను ఎవర్నీ అడగలేదు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడిని అడగండి. నేను అడిగానని చెబితే నన్ను ఉరేయండి. నాకు ఆ పదవి కావాలనే కోరికే ఉంటే, చంద్రబాబునాయుడు గారితో, బీజేపీతోనే నేను కలిసి ఉండాలిగా?' అని శివాజీ ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేష్‌లు అవినీతి పరులు కాదని అన్నారు. అయితే, టీడీపీలోని కొందరు ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. వారిని చంద్రబాబు నియంత్రించాలని అన్నారు. తమ బంధువు రూ. 70లక్షలకు భూమి కొన్న చోటే.. పవన్‌కు మాత్రం రూ.20లక్షలకే ఆ మేర భూమి లభించడం దేనికి నిదర్శనమని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories