నిన్న సిద్దిపేట.. ఇవాళ మానకొండూరు... యాక్సిడెంట్లు చెబుతున్న నిజాలు

నిన్న సిద్దిపేట.. ఇవాళ మానకొండూరు... యాక్సిడెంట్లు చెబుతున్న నిజాలు
x
Highlights

ఓ చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సివస్తోంది. రోడ్డుపైకి వెళ్లితే చాలు మృత్యువు ఎటు నుంచి దూసుకువస్తుందోనని భయపడాల్సిన పరిస్థితి. కళ్ల...

ఓ చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సివస్తోంది. రోడ్డుపైకి వెళ్లితే చాలు మృత్యువు ఎటు నుంచి దూసుకువస్తుందోనని భయపడాల్సిన పరిస్థితి. కళ్ల ఎదుట ఎం జరుగుతుందో తెలుసుకునేలోపే కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. అప్రమత్తం అయ్యేలోపే అంతా జరిగిపోతోంది. తప్పు ఒకరిదైతే.. శిక్ష మాత్రం చాలా మంది అనుభవించాల్సి వస్తోంది.

లారీ, బస్సు, కంటెయినర్.. వాహనం ఎదైనా.. హైవే ఎక్కితే చాలు రాకెట్ లా దూసుకుపోతున్నాయి. చేతిలో స్టీరింగ్, ఎదురుగా హైవే కనిపిస్తే చాలు.. నిబంధనలను విరుద్ధంగా మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్, కనీసం జాగ్రతలను కూడా పాటించడం లేదు. దీంతో అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. భారీ వాహనాలు ఢీకొంటే చాలు.. ప్రమాద తీవ్రత కూడా భారీగానే ఉంటోంది. దీంతో మృతుల సంఖ్య కూడా పెద్దసంఖ్యలో ఉంటోంది.

ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన ప్రమాదంలో 13మంది మృతి చెందగా.. ఇప్పుడు కరీంనగర్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఏడుగురు చనిపోయారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ భారీవాహనాలే ఢీకొన్నాయి. చనిపోయింది మాత్రం అమాయక ప్రజలు. హెవీ వెహికల్స్ నడుపుతున్న డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతో రావడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

అసలే హెవీ వెహికల్స్.. ఆపైన హై స్పీడ్.. మితిమీరిన వేగంతో దూసుకుపోతుంటే, సడన్ గా బ్రేక్ వేయాల్సి వస్తే.. హై స్పీడ్ లో ఉన్న వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టడమో.. లేదంటే, ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని ఢికొట్టడమో జరుగుతోంది. అదే సమయంలో వెనుక వస్తున్న వెహికల్స్, ముందు ఎం జరుతుందో తెలుసుకునే లోపే.. మరో ప్రమాదం జరిగిపోతోంది. ఇలా తాము చేయని తప్పుకు.. అమాయక ప్రజలు కూడా బలవుతున్నారు. కొందరి నిర్లక్ష్యానికి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అధికారులు హడావిడి చేస్తున్నారు. చర్యలు చేపడతామని హామీలు ఇస్తున్నారు. మళ్లీ మరో భారీ ఎక్సిడెంట్ జరిగే వరకు స్పందించరు. దీంతో డ్రైవర్లు సైతం, సేఫ్ డ్రైవింగ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చివరి అమాయక ప్రజలే బలవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories