ఈ ఐదుగురు దేశంలో ఫేమ‌స్ ఛాయ్ వాలాలు

ఈ ఐదుగురు దేశంలో ఫేమ‌స్ ఛాయ్ వాలాలు
x
Highlights

అర్షద్ ఖాన్ : నెటిజన్ లకు ఈ పేరు పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే పాక్ లో నీలి కళ్ల రంగుతో, ఛాయ్ తయారు చేస్తూ అర్షద్ ఖాన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్...

అర్షద్ ఖాన్ : నెటిజన్ లకు ఈ పేరు పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే పాక్ లో నీలి కళ్ల రంగుతో, ఛాయ్ తయారు చేస్తూ అర్షద్ ఖాన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే ఆ ఒక్క ఫోటోనే అతని జీవితాన్ని మార్చేసింది. ఛాయ్ వాలా నుంచి మోడల్ గా మారిపోయాడు. అంతేకాదు మోడల్ గానే కాకుండా కబీర్‌ అనే సినిమాలో హీరో సోదరుడిగా వెండితెరపై వెలిగిపోతున్నాడు. ఎన్నో సినిమాల్లో ఆఫర్లు వచ్చినా నో చెప్పిన అర్షద్ ఖాన్.. కబీర్ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్ సిగ్వల్ ఇచ్చేశాడు

ఉప్మా విర్ది : ఛాయ్ వాలా గా అడుగుపెట్టి వ్యాపారంలో రాణిస్తుంది. ఒక పక్క లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ నే మరోపక్క ఛాయ్ వాలీ అని సంస్థను నడుపుతోంది. ఈమె తయారు చేసిన ఛాయ్ ఫేమస్ కావడంతో కొద్ది కాలంక్రితం ఆమెకు ఓ అవార్డు కూడా దక్కింది.
కిషోర్ భాజీయావాలా : ఛాయ్ వాలాగా జీవనం గడుపుతున్న కిషోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వందల కోట్ల మనీని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా. ఆశ్చర్యపోకండి తాను టీ అమ్మగా వచ్చిన సొమ్ము.
సోమ్ నాథ్ గ్రిమ్ : ఛాయ్ వాలా తన జీవితాన్ని కొనసాగిస్తున్న సోమ్ నాథ్ గ్రిమ్ ఛార్టెడ్ అకౌంట్ కంప్లీంట్ చేశాడు. అంతేకాదు కొద్దిరోజుల్లో కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న లెరన్ టూ ఎరన్ అనే ప్రాజెక్టు ఈయన బ్రాండ్ అంబాసీడర్ గా ఎన్నికయ్యాడు.
ప్రధాని మోడీ : ఛాయ్ వాలాగా, పార్టీ కార్యకర్తగా అంచలంచెలుగా ఎదిగి నేడు భారత ప్రధానిగా ప‌రిపాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories