30 మందికి చేరిన మృతుల సంఖ్య.. ప్రముఖుల సంతాపం..

30 మందికి చేరిన మృతుల సంఖ్య.. ప్రముఖుల సంతాపం..
x
Highlights

కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు నీటి కాలువలో...

కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు నీటి కాలువలో పడింది. దీంతో భారీ ప్రమాదం జరగగా.. ఈ దుర్ఘటనలో 30 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నిన్న 25 మంది మృతదేహాలను వెలికి తీయగా రాత్రి మరో ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు భద్రతా సిబ్బంది. మృతుల్లో 8 మంది పురుషులు, 13 మంది మహిళలు, 9 మంది పిల్లలున్నారు. మృతిచెందిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బెంగళూరుకు సుమారు 105 కి.మీ దూరంలోని పాండవపుర తాలూకా కానగానమారండి వద్ద మధ్యాహ్నం బస్సు అదుపు తప్పి 12 అడుగుల లోతున్న వీసీ కెనాల్‌లో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది మండ్య జిల్లా వాదెసముద్ర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పిల్లలు స్కూలు ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి కుమారస్వామి లు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories