ప్రియురాలి తలతో పోలీస్‌ స్టేషన్‌కు..

ప్రియురాలి తలతో పోలీస్‌ స్టేషన్‌కు..
x
Highlights

ఇటీవల కాలంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. సాటి మనుషులన్న జ్ఞానం కూడా లేకుండా పశువుల్లా ప్రవర్తించి ప్రాణాలు తీస్తున్నారు. ప్రియురాలు మరోవ్యక్తితో...

ఇటీవల కాలంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. సాటి మనుషులన్న జ్ఞానం కూడా లేకుండా పశువుల్లా ప్రవర్తించి ప్రాణాలు తీస్తున్నారు. ప్రియురాలు మరోవ్యక్తితో చనువుగా ఉంటోందని భావించిన వ్యక్తి ఆమె తల నరికి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఈ ఘటన కర్ణాటక చిక్కబళ్లాపుర సరిహద్దులోని కంచార్లపల్లిలో జరిగింది. కోలార్ తాలూకు శ్రీనివాసపురం మండలం గఫార్‌ఖాన్‌ వీధికి చెందిన అజీజ్‌ (27) మొబైల్‌ షాపు నడుపుతున్నాడు. అతనికి నాలుగేళ్ళ కిందటే పెళ్లయింది. కానీ భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే బెంగళూరుకు చెందిన రోషన్‌ఖానం (24)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే రోషన్‌ఖానం మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. మొదట హెచ్చరించాడు. అయినా సదరు మహిళ వియానకపోవడంతో ఆమెను అంతమొందించాలన్న పథకం రచించాడు. గురువారం ఓ దర్గాలో పూజలు చేద్దామని నమ్మించి ఆమెను పిలిచాడు. దర్గాను దర్శించుకున్నాక గ్రామ శివార్లలోని మామిడి తోపు షెడ్‌లోకి వెళ్లారు. అక్కడ అజీజ్‌ వేటకొడవలితో ఆమె గొంతు నరికి తల వేరుచేశాడు. తలను బ్యాగులో పెట్టుకొని బైక్‌పై శ్రీనివాసపురం స్టేషన్‌లో లొంగిపోయాడు. తనను మోసం చేసి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో హత్య చేశానని పోలీసులకు అతడు వివరించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories