ఓ మై డియ‌ర్ ఫ్రెండ్

ఓ మై డియ‌ర్ ఫ్రెండ్
x
Highlights

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా త‌యారైంద‌ని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. దావోస్...

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా త‌యారైంద‌ని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. దావోస్ ప‌ర్య‌ట‌న అనంత‌రం బీజేపీ తీరును విమ‌ర్శించిన చంద్ర‌బాబు పొత్తు వ‌ద్దు అనుకుంటే ..న‌మ‌స్కారం పెట్టి వెళ్లి పోతాం అంటూ బీజేపీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ మ‌రుస‌టిరోజే కేంద్రం మ‌న‌కు న్యాయం చేస్తుంది. మిత్ర‌బంధం పాటించండి అంటూ హితబోధ చేశారు. అంత‌వ‌ర‌కు బాగున్నా మొన్న ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో కేంద్రం నిధులుకేటాయించ‌లేదు. రాష్ట్రం ఆర్ధికంగా వెన‌క‌బ‌డి ఉంది అంటూ మోక‌రిల్లినా ప‌ట్టించుకోని బీజేపీ నిధులు అడ‌గ‌కుండా కొన్ని రాష్ట్రాల‌కు కోట్ల‌లో లెక్క‌పెట్టీ మ‌రి కేటాయించింది.
దీంతో చంద్ర‌బాబు హుటాహుటీన భేటీ నిర్వ‌హించిన చంద్ర‌బాబు మిత్రులుగా ఉన్న త‌మని పట్టించుకోవ‌డం లేద‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. బీజేపీతో దెగ‌దెంపులు చేసే ప్ర‌య‌త్నం చేశారు. దీన్ని తిరస్క‌రించిన ఆర్ధిక మంత్రి య‌న‌మ‌ల చంద్ర‌బాబుకు నచ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. బీజేపీతో క‌టిఫ్ చెప్ప‌డం వ‌ల్లే న‌ష్టాలే కానీ లాభాలు లేవ‌నే అనుమానాల్ని అధినేత దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. య‌న‌మ‌ల వాద‌న‌ను విభేదించిన చంద్రబాబు... ఇంకా మనం సైలెంట్ గా ఉంటే మనపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా మొన్న సాయంత్రం జరిగిన రాద్దాంతం. అయితే నిన్న ఉదయానికి మొత్తం పరిస్థితి మారిపోయిందన్న వాదన వినిపించింది.
బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగింద‌ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు ప్ల‌కార్డ్ తో నిర‌స‌న గ‌ళం విప్పారు . ఓ సంద‌ర్భంలో స్పీక‌ర్ కురియ‌న్ కేవీపీ నిర‌స‌న‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ స‌భ‌ను వాయిదా వేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మరి ఆ రెండు పార్టీలు అన్యాయం పై గొంతు చించుకున్నా టీడీపీ నేత‌లు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా ఉన్నారు. దీనిపై స్పందించిన వైసీపీ నేత‌లు చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చిన కారణంతోనే టీడీపీ ఎంపీలు వెనక్కు తగ్గారనే అనుమానం వ్య‌క్తం చేశారు.
అయితే దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని ప‌లువురు గుస‌గుస‌లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసిన‌ట్లు చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించిన చార్జీషిట్లో చంద్రబాబు పేరు కూడా ఉంది. దీనిపై విచారిస్తారేమే..? ఈ కేసు కారణంగానే ఏపీ డిమాండ్లను చంద్రబాబు కేంద్రం ముందు గట్టిగా వినిపించలేకపోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories