Y.S.Jagan Comments: ఇది చాలా పెద్ద కార్యక్రమం, గొప్ప కార్యక్రమం...

అమరావతి..

‘వైయస్సార్‌ బీమా’ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్ ..:

-ఏ ఒక్క కుటుంబం బాధ పడొద్దు

– ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకునే ప్రభుత్వం మాది.

– ఒక నిరుపేద కుటుంబం, సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం బాధ పడొద్దన్న ఉద్దేశంతో పథకం అమలు.

కేంద్రం తప్పుకున్నా..:

– గతంలో ఉన్నట్లుగా కాకుండా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ పథకం అమలు చేస్తోంది.

– ఏటా రూ.510 కోట్ల ఖర్చుతో బియ్యం కార్డు అర్హత ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ కల్పిస్తోంది.

పారదర్శకంగా:

– పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశారు. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు.

– ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించమని కోరాము.

– అర్హత ఉండి కూడా ఎవరి పేర్లు అయినా ఆ జాబితాలో లేకపోతే వారు తమ పేర్లు వెంటనే నమోదు చేసుకోవచ్చు.

బీమా ప్రయోజనాలు:

– పథకంలతో 18–50 ఏళ్ల మధ్య ఉన్న లబ్ధిదారులు సహజ మరణం సంభవిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల సహాయం

– 18–50 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ మరణించినా లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం.

– ఇక 51–70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ చనిపోయినా లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.3 లక్షల సహాయం.

– ఇంకా 18–70 ఏళ్ల మధ్య ఉన్న వారికి పాక్షిక లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షల పరిహారం ఇస్తారు.

నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో:

– పథకంలో ప్రీమియమ్‌ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

– బ్యాంకర్లు ఆ నగదును తొలుత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి, ఆ తర్వాత బీమా కంపెనీలకు ప్రీమియమ్‌గా చెల్లిస్తారు.

– ఆ తర్వాత ఒక వారంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేస్తారు.

– పథకం లబ్ధిదారులకు ఏ సమస్య వచ్చినా గ్రామ, వార్డు సచివాలయాలు రెఫరల్‌ పాయింట్‌గా ఉంటాయి.

తక్షణమే రూ.10 వేలు:

– ఏదైనా ప్రమాదం జరిగి, కుటుంబ పెద్ద చనిపోతే, క్లెయిమ్‌ పొందడానికి 15 రోజులు పడుతుంది.

– ఆలోగా ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేలు ఇస్తారు.

– ఇది పథకంలో లేకపోయినా, కొత్తగా అమలు చేయబోతున్నాము.

Show Full Article
Print Article
Next Story
More Stories