Y.S.Jagan: సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్....

సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ కామెంట్స్

వ్యవసాయానికి ప్రాధాన్యం:

– కోవిడ్‌ సమయంలో నిధులకు కొరత లేకుండా చూసినందుకు ధన్యవాదాలు

– ఆర్థిక రంగానికి వ్యవసాయ రంగం ఒక వెన్నుముక, రాష్ట్రంలో దాదాపు 62 శాతం ఆ రంగంపైనే ఆధారపడ్డారు.

– అందుకే ఆ రంగం ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం, ఆ దిశలో పలు చర్యలు తీసుకుంది.

  వైయస్సార్‌ రైతుభరోసా, పీఎం–కిసాన్‌:

– రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా రూ.13,500 చెల్లింపు.

– ఖరీఫ్‌ ప్రారంభంలో (జూన్‌లో) రూ.7500, ఆ తర్వాత రబీ ప్రారంభం (అక్టోబరులో) రూ. 4 వేలు, ఆ తర్వాత పంట చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండగ సమయంలో మరో రూ.2 వేలు ఇస్తున్నాము.

 రైతు భరోసా కేంద్రాలు:

– ప్రతి గ్రామంలో ఆర్బీకేల ఏర్పాటు, 10,600కు పైగా కేంద్రాలు ఏర్పాటు.

– పరీక్షించిన, నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా, ఆర్డర్‌ చేసిన 48 గంటల్లో డోర్‌ డెలివరీ.

– ఈ–క్రాపింగ్‌.

_ గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు, వారంతా కలిసి ఈ–క్రాపింగ్‌ చేస్తున్నారు.

  ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలు:

– 2020–21 ఖరీఫ్‌లో రుణాలు రూ.75,237 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.62,650 పంపిణీ చేశారు.

– ఇది టార్గెట్‌లో 83.27 శాతం కాగా, గత ఏడాది కంటే ఇది రూ.3 వేల కోట్లు తక్కువ.

– గ్రామంలో ఈ–క్రాపింగ్‌లో నమోదైన ప్రతి రైతుకు రుణాలు అందుతున్నాయా? లేదా అన్నది చూడాలి.

– బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఆ రైతు ఈ–క్రాపింగ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉన్నాడా? అన్నది చూడాలి.

– పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ–క్రాపింగ్‌ తప్పనిసరి.

  అదే విధంగా ఎక్కడా అవినీతికి తావు ఉండదు.

  ధరల స్థిరీకరణ నిధి:

– గత ఏడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3200 కోట్లతో పంటలు కొన్నాము.

– ఈసారి దాదాపు రూ.3500 కోట్లతో ఆ నిధి ఏర్పాటు చేశాము.

– సచివాలయంలో ఉండే వ్యవసాయ సహాయకుడు ప్రతి రోజూ పంటల ధరలు, వాటి డిమాండ్‌ను ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో అప్‌డేట్‌ చేస్తారు.

   ఇంకా..

– ప్రతి గ్రామంలో గోదాములు. మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయబోతున్నాము.

– అదే విధంగా ప్రతి గ్రామంలో జనతా బజార్ల ఏర్పాటు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ ఏర్పడుతుంది.

– వీటన్నింటికీ బ్యాంకర్ల నుంచి సపోర్టు కావాలి.

  నాడు–నేడు:

– ఇంకా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం నాడు–నేడు చేపట్టాము. దానికి కూడా బ్యాంకర్ల సహాయం కావాలి.

– ప్రతి స్కూల్‌లో 10 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము, మంచినీరు, టాయిలెట్లు, ప్రహరీలు, లైట్లు, కిచెన్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు     చేస్తున్నాము.

– తొలి దశలో 15,715 స్కూళ్లులో మార్పులు. డిసెంబరులో రెండోదశ పనులు చేపట్టబోతున్నాము.

– స్కూళ్లలో నాడు–నేడు కోసం తొలి దశలో రూ.4000 కోట్లు, రెండో దశలో రూ.4500 కోట్లు, మూడో దశలో దాదాపు రూ.3500 కోట్లు ఖర్చు చేయబోతున్నాము.

  విలేజ్‌ క్లినిక్‌లు:

– ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు.

– ఇంకా 51కి పైగా మందులు కూడా ఆ క్లినిక్‌లో ఉంటాయి.

  ఆస్పత్రులు, నాడు–నేడు, టీచింగ్‌ ఆస్పత్రులు:

– ఆస్పత్రుల్లో కూడా నాడు–నేడుతో పూర్తిగా మార్పులు చేయబోతున్నాము.

– కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రుల ఏర్పాటు.

– ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒక టీచింగ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయబోతున్నాము.

– దీనిపై కోవిడ్‌ వీడియో కాన్ఫరెన్సులో ప్రధానమంత్రికి కూడా నివేదించాము.

– వచ్చే 3 ఏళ్లలో దాదాపు రూ.13 వేల కోట్లు, 16 టీచింగ్‌ ఆస్పత్రులకు ఖర్చు చేయబోతున్నాము.

  సంక్షేమ పథకాలు:

– వచ్చే నెలలో జగనన్న తోడు పథకం అమలు చేయబోతున్నాము.

– ఇక వైయస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మహిళలకు ప్రయోజనం కలుగుతోంది.

– వారికి ఉపాధి కల్పన దిశలో అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, రిలయెన్స్, అల్లానా గ్రూప్‌లతో అవగాహన చేసుకున్నాము.

– ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మహిళలకు మొత్తం రూ.75 వేల సహాయం చేస్తాము.

– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్లో 45–60 ఏళ్ల వారికి సహాయం.

  ఎంఎస్‌ఎంఈలు:

– ఎంఎస్‌ఎంఈ రంగానికి అర్థికంగా అండ. కోవిడ్‌ సమయంలోనూ పారిశ్రామిక రాయితీ (పెండింగ్‌లో ఉంటే) పూర్తిగా రూ.1100 కోట్లు ఇచ్చాం.

– ఆ మొత్తం ఎంఎస్‌ఎంఈ రంగానికి ఎంతో అండగా నిల్చింది. కోవిడ్‌ సమయంలో వారికి పెట్టుబడిగా ఉపయోగపడింది.

 స్వయం సహాయక బృందాలు:

– వైయస్సార్‌ ఆసరా పథకం ద్వారా ఆ మహిళలకు సహాయం. వారి రుణాలు నాలుగేళ్లలో పూర్తిగా చెల్లింపు.

– వీటన్నింటి కోసం బ్యాంకర్ల మద్దతు ఉండాలని, సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను.

Show Full Article
Print Article
Next Story
More Stories