Shamshabad updates: బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్...

శంషాబాద్

//ఎల్ రమణ టీడీపీ అధ్యక్షుడు

//గ్రేటర్ హైదరాబాద్ గగన్ పహడ్ అప్పచెరువు విషయంలో ప్రభుత్వం జ్యూడీషియల్ (మెజిస్టీరియల్) ఎంక్వయిరీ చేయించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ   రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ డిమాండ్ చేశారు.

//అప్పచెరువు దుర్ఘటన కు ఎవరు బాధ్యత వహిస్తారు... అధికారులా, స్థానిక ఎమ్మెల్యేనా, కెటిఆర్, కెసిఆర్ లలో ఎవరు బాధ్యత వహిస్తారు..?

//బాధిత కుటుంబాలకు 30 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్.

//గ్రేటర్ హైదరాబాద్ శివారు మైలార్ దేవుపల్లి డివిజన్ గగన్ పహాడ్ అప్ప చెరువు తెగి వరదల్లో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించిన టీడీపీ రాష్ట్ర   అధ్యక్షుడు ఎల్. రమణ.

//మృతుల కుటుంబాలకు 10000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేత

//ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక మంది వరదల్లో మునిగి మృతిచెందారు..

//వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయలేదు..

//హైదరాబాద్ నగరంలోని అన్ని చెరువులకు మరమ్మతులు చేస్తామని , నాళాలను విస్తరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదు..

//గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు..

//30000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ హామీలను విస్మరించింది..

//వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు 30 లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందజేయాలి...

Show Full Article
Print Article
Next Story
More Stories