MLA Harish Rao: పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని‌ నిలదీస్తాం: మంత్రి హరీష్ రావు

ఆర్ధిక మంత్రి హరీష్ రావు @ ఎంహెచ్ఆర్డీ...

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని‌ నిలదీస్తామన్న మంత్రి హరీష్ రావు

జీఎస్టీ నిధులపై తెలంగాణకు కేంద్రం చేస్తోన్న అన్యాయంపై న్యాయస్థానాల్లో సైతం పోరాటం చేస్తాం

కరోనా పేరుతో రాష్ట్రాలకు రావాల్సిన లక్ష 35వేల కోట్లను కేంద్రం ఎగ్గొట్టాలని చూస్తోంది

జీఎస్టీ నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిన బాధ్యత కేంద్రానిదే. 

కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోంది

ఆదాయం పెంచుకోవటంలో కేంద్రానికికున్న అవకాశాలు రాష్ట్రాలకు ఉండవు

విపత్కర పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి

కేంద్రానికి మాత్రమే కాదు.. రాష్ట్రాలకు సైతం కరోనా ప్రభావముంది

సెస్ రూపంలో‌ తెలంగాణ చెల్లించింది ఎక్కువ.. తీసుకుంది తక్కువ

జీఎస్టీలో చేరటం తెలంగాణకు శాపంగా మారింది

పార్లమెంట్ లో తాను చేసిన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తోంది

దేశ ప్రయోజనాల‌ కోసమే తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీలో చేరింది

జీఎస్టీలో చేరటం వలన తెలంగాణ ప్రభుత్వం 25వేల కోట్లు నష్టపోయింది

రాష్ట్రాలకు నష్టపరిహారాన్ని కేంద్రమే చెల్లించాలని అటార్ని జనరల్ సైతం చెప్పారు

లీగల్ గా, మోరల్ గా కేంద్రం రాష్ట్రలకు జీఎస్టీ నష్టపరిహారం చెల్లించాల్సిందే

ఇప్పటి వరకు జిఎస్టీ ప్రారంభం అయినప్పటి నుండి 18వేల30 కోట్లు మేము కేంద్రానికి ఇస్తే కేంద్రం నుండి రాష్ట్రానికి కేవలం 3వేల కోట్లు మాత్రమే వచ్చాయి...

జిఎస్టీ పై ప్రారంభం లోనే అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే చేరాం...

ఎఫ్ఆర్బిఎం లో రాష్ట్రానికి 3 శాతం ఇస్తే కేంద్రం 5 శాతం తీసుకుంటుంది...

తెలంగాణ తో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ,కేరళ పంజాబ్,రాజస్థాన్ ఈ ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నాయి...

కేంద్ర ప్రభుత్వమే లోన్ తీసుకొని పూర్తి స్థాయిలో జిఎస్టీ ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన సెస్ చెల్లించాలి...

Show Full Article
Print Article
Next Story
More Stories