Krishna District Updates: లక్ష్మీ నరసింహన్ పోలీసులపై చేసిన ఆరోపణలు నిరాధారం...

 కృష్ణాజిల్లా...

- దళిత పారిశ్రామిక వేత్త లక్ష్మీ నరసింహన్ అంశంపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ సత్యానందం, మహిళా పోలీస్ DSP షేక్ అబ్దుల్ అజీజ్    మీడియా బ్రీఫింగ్

- డిఎస్పీ సత్యానందం

- నందివాడ మండలం తమిరిస గ్రామంలో లక్ష్మీ నరసింహన్ 147 ఎకరాల రొయ్యల చెరువు సబ్ లీజుకు తీసుకొని సాగు చేస్తోంది

- మచిలీపట్నం, గుడివాడ లలో లక్ష్మీ నరసింహన్ పై అనేక ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ఫిర్యాదులు విచారణ దశలో ఉన్నాయి

- 2018 లో మచిలీపట్నం పరిధిలో, పలువురిపై కేసు పెట్టిన సందర్భాల్లో తాను ముదలియార్ కులానికి చెందినట్లుగా లక్ష్మీ నరసింహన్ ఫిర్యాదు చేసింది

- గత అక్టోబర్ లో నూకల రామకృష్ణ, అతని కుమారుడు బాలాజీ తనను కులం పేరుతో దూషించారని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు     చేశాం 

- లక్ష్మీ నరసింహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మహిళ పోలీస్ డిఎస్పి ఆధ్వర్యంలో చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం

- నూకల రామకృష్ణ, అతని కుమారుడు పై కేసు విచారణ జరుగుతుండగానే తాను సాగు చేస్తున్న చెరువులో 150 టన్నుల రొయ్యలను దొంగిలించినట్లు         నరసింహన్ మరో ఫిర్యాదు చేసింది

- లక్ష్మీ నరసింహన్ ఇచ్చిన రెండో ఫిర్యాదు పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం

- ఆధారాలు లేకపోవడంతో ఎవరినీ అరెస్టు లు చేయలేదు

- చట్ట ప్రకారం విచారణ జరుగుతుంది

- మహిళా పోలీస్ స్టేషన్, DSP షేక్ అబ్దుల్ అజీజ్

- లక్ష్మీ నరసింహన్ ఇచ్చిన రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసి చట్టప్రకారం విచారణ చేస్తున్నాం

- లక్ష్మీ నరసింహన్, నూకల రామకృష్ణ కు చెరువు సబ్ లీజు సొమ్ము తో పాటుగా ఆరు లక్షల కరెంట్ బిల్లులు బకాయి

- బకాయి సొమ్ము ఇవ్వని నేపథ్యంలో 20 టన్నుల రొయ్యలను, తమ బకాయి గా జమ చేసుకొని రామకృష్ణ తీసుకెళ్లినట్లు గా గుర్తింపు

- సంబంధం లేని ఇతర ఆర్థిక లావాదేవీల కేసులను నూకల రామకృష్ణ కేసుతో ముడి పెట్టడం వల్ల, విచారణ ఆలస్యమవుతోంది

- పోలీసులపై లక్ష్మీనరసింహన్ చేసిన వాక్యాలు పూర్తి నిరాధారం

- ఆమెపై పలువురు చేసిన ఫిర్యాదులపై కూడా విచారణ జరుగుతుంది

Show Full Article
Print Article
Next Story
More Stories