సంస్కరణలతో 13,5 శాతం వృద్ది రేటు సాధించాం: చంద్రబాబు



దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని చంద్రబాబు చెప్పారు. 1946లోనే విశాలాంధ‌్ర కోసం పోరాడినట్టు చెప్పారు. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు. కర్నూల్ రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 1956 నవంబర్ 1న ఏర్పడిన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో పాలన సాగించినట్టు చంద్రబాబు చెప్పారు. తన అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడేతత్వంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసి వేగంగా ముందుకువెళ్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో 13,5 శాతం వృద్ది రేటుతో ముందుకు సాగుతున్నామని సీఎం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories