Ganesh Chaturthi celebrations: అక్క‌డ వినాయ‌క విగ్రహాన్ని పెట్టడానికి హైకోర్టు అనుమ‌తి

టీఎస్ హైకోర్టు: జియాగూడ లోని రంగనాథ స్వామి ఆలయంలో గణేష్ విగ్రహాన్ని పెట్టడానికి అనుమతించిన హైకోర్టు....

కులుసుమ్ పూర పోలీస్ స్టేషన్ పరిధిలో రంగనాథస్వామి ఆలయంలో లో తీసుకువచ్చిన దేవాలయ కమిటీ...

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి విగ్రహాన్ని పెట్టడాన్ని అడ్డుకున్న పోలీసులు...

ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా న్యాయవాది భాస్కర్ రెడ్డి...

గత కొన్ని సంవత్సరాలుగా రంగనాథస్వామి ఆలయంలో గణేష్ ఉత్సవాలు జరుపుతామని కోర్టుకు తెలిపిన భాస్కర్ రెడ్డి...

ఇప్పటికే విగ్రహాన్ని కూడా తీసుకువచ్చామని కోర్టుకు తెలిపిన భాస్కర్ రెడ్డి...

కరుణ నిబంధనలు పాటించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కోర్టుకు తెలిపిన భాస్కర్ రెడ్డి...

ఒక్క విగ్రహానికి అనుమతిస్తే నగరంలో ఉన్న కొన్ని వేల మంది అనుమతులు కోరుతారని కోర్టు తెలిపిన ప్రభుత్వం..

6 ఫీట్ల విగ్రహాన్ని తెచ్చి నిబంధనలు ఉల్లంఘించారని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం...

దేవాలయంలో ప్రతిష్టిస్తున్న విగ్రహానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్న హైకోర్టు...

ఆర్టికల్ 25 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను హరించలేమన్న హైకోర్టు...

గణేష్ విగ్రహాన్ని పెట్టడానికి కి నిబంధనలతో కూడిన అనుమతించిన హైకోర్టు..

ప్రజా సంక్షేమం శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించమని దేవాలయ కమిటీ సంబంధిత అధికారులకు హామీపత్రం ఇవ్వాలన్న హైకోర్టు...

దేవాలయంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి నివేదిక కోర్టుకు సమర్పించాలని దేవాలయ కమిటీ కి హైకోర్టు ఆదేశం..

మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ సూచించిన నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలని హైకోర్టు..

మూడు రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి మళ్ళీ విచారిస్తామని హైకోర్టు...

హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని నిబంధనలు పాటిస్తామన్న పిటిషనర్ భాస్కర్ రెడ్డి.

తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories