East Godavari Weather updates: తుపాను హెచ్చరికల నేపధ్యంలో తూర్పుగోదావరిలో ముందు జాగ్రత్తలు!

తూర్పుగోదావరి :

-తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను ప్రభావంపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన వాతావరణశాఖ..

-తీరం వెంబడి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణశాఖ..

-మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ.. వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించాలని ఆదేశం..

-వాతావరణశాఖ హెచ్చరికల నేపధ్యంలో 13 తీర ప్రాంత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా మురళీధర్ రెడ్డి..

-తీర ప్రాంత మండలాలకు అనుబంధంగా ఉన్న మరో 13 మండల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశం..

-తుఫాన్ షెల్టర్లు సిద్ధం చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం..

-మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

Show Full Article
Print Article
Next Story
More Stories