విజయవాడపైలా సోమినాయుడు, దుర్గ గుడి... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ

పైలా సోమినాయుడు, దుర్గ గుడి చైర్మన్.

శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించాం.

కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు చక్కగా సహకరించారు.

అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలను చక్కగా నిర్వహించగలిగాం.

కొండచరియలు విరిగిపడిన ఘటనపై స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దేవాలయ అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు కేటాయించడం చారిత్రాత్మకం.

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దుర్గమ్మ దేవస్థానానికి

85 వేల మంది ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే, వారిలో దాదాపు 35 వేల మంది దర్శనానికి రాలేకపోయారు.

నేరుగా వచ్చే భక్తుల కోసం కరెంట్ బుకింగ్ ఏర్పాటుచేసాం.

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 2 లక్షల మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ ఉత్సవాల్లో దేవస్థానానికి రూ.4.36 కోట్ల ఆదాయం వచ్చింది.

అభివృద్ధి పనులకు త్వరితగతిన అంచనాలను రూపొందించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించారు.

సురేష్ బాబు, ఈవో.

భక్తుల సౌకర్యాలు, రక్షణ చర్యలకు ఏవిధమైన లోటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తున్నాం.

ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాం.

ఆన్లైన్ విధానంలోనే దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులు విధిగా ఆన్లైన్ టిక్కెట్లు తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories