ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్... ... Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

#ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు.

#అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లకు దృశ్యమాధ్యమం ద్వారా సీఎస్​ దిశానిర్దేశం చేస్తున్నారు.

#ఈనెల 25 విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

#ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ ఏ మేరకు పూర్తయిందనే అంశాలపై దృష్టిసారించారు.

# ఎదురవుతున్న ఇబ్బందులు.. అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్​ సోమేశ్ కుమార్ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 

#ఆస్తుల నమోదుకు ఇంకా నాలుగు రోజుల గడువే ఉండగా.. భారీ వర్షాల వల్ల కొంతమేరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

#రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ 70శాతం వరకు పూర్తవగా.. జీహెచ్​ఎంసీ పరిధిలో నెమ్మదించింది.

# ఇప్పటివరకు 75 లక్షలకుపైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు.

#రోజుకు 6లక్షలకుపైగా ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు.

#ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి తహసీల్దార్లకు 3రోజుల క్రితమే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. భారీ వర్షాల వల్ల వాయిదా పడింది.

#ఈ అంశాలన్నింటిపై పరిష్కారానికి సీఎస్​ సోమేష్‌కుమార్‌ దృష్టిసారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories