దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో ఒక్కరోజులోనే పూర్తయిన 6.76 కి.మీ. రైలు మార్గాల పునరుద్ధరణ ...

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 6.76 కి.మీ. రైలు పట్టాల పునరుద్ధరణ సాధించిన డివిజన్‌గా సికింద్రాబాద్ కి పేరొచ్చింది...

ఆగస్ట్ 24 మరియు 25 తేదీలలో మొత్తం 13.25 కి.మీ. ట్రాక్ రిన్యూవల్ , 24 న 6.50 కి.మీ. 25 న 6.75 కి.మీ ఒకే సమయంలో పూర్తి చేయడం జరిగింది...

తగ్గిన ట్రాఫిక్ ప్రవాహాన్ని చక్కగా వినియోగించుకొని ఈ డివిజన్ ఒక్కరోజులోనే 6.76 కి.మీ. రైలు పట్టాల పునరుద్ధరణ పూర్తి చేసి రికార్డు స్థాయి టిఆర్ఆర్ సాధించింది....

100 % భద్రతతో ఈ పని పూర్తిచేయడం జరిగింది 25 % పని రైల్వే కార్మికుల ద్వారానే చేపట్టడం జరిగింది...

ప్రతి సంవత్సరం సికింద్రాబాద్ డివిజన్ సుమారు 130 నుండి 150 కి.మీ. రైలు పట్టాల మరమ్మత్తు చేపడుతుంటుంది...

ఒకే సమయంలో డివిజన్లోని 5 విభిన్న స్థలాలలో పనిని చేపట్టి , ఈ రికార్డు సాధించడం జరిగింది మహబూబాబాద్ , తాండూర్ , బెల్లంపల్లి , బీబీనగర్, మధిర . సికింద్రాబాద్ డివిజన్ సాధించిన ఈ రికార్డుకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రశంసలు లభించాయి...

Show Full Article
Print Article
Next Story
More Stories