టీఎస్ హైకోర్టు...... ఉస్మానియా ఆస్పత్రి పై... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

టీఎస్ హైకోర్టు...... ఉస్మానియా ఆస్పత్రి పై హైకోర్టులో విచారణ...

ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చెరుకుందని.. రోగులు, డాక్టర్లు, సిబ్బందికి ప్రాణాపాయం ఉందని కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్..

వర్షాలకు ఆస్పత్రి భవనంలోకి చేరిన నీటి గురించి మీడియా వార్తలు, కథనాలను చూసామన్న చీఫ్ జస్టిస్

కొన్ని వ్యాజ్యాలు పురావస్తు భవనం కూల్చివేయొద్దని, మరికొన్ని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నాయని వాటిని విభజించి విచారణ జరుపుతామన్న హైకోర్టు..

పురావస్తు భవనాన్ని కూల్చకుండా 26 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించవచ్చని కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి..

ఎవరుపడితే వారు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేస్తున్నారని ఏజీ..

పిటిషనర్ దేబారా 15 ఏళ్ల నుంచి ప్రజాపోరాటంలో పాలుపంచుకుంటున్నారన్న రచనా రెడ్డి..

ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన అన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కలిపి విచారిస్తామన్న హైకోర్టు

విచారణ ఈ నెల 24 కు వాయిదా వేసిన సీజే ధర్మాసనం

Show Full Article
Print Article
Next Story
More Stories