భద్రాద్రి కొత్తగూడెం: - చర్ల మండలంలోని తాలిపేరు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

భద్రాద్రి కొత్తగూడెం:

- చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ లోకి భారీ వర్షాల కారణంగా ఐదవ రోజు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

- స్థానికంగా కురిసే వర్షాలతో పాటు ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలోని చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కురిసే వర్షాలతో పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

- దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద ప్రవాహం ఉండటంతో అదికారులు ప్రాజెక్ట్ కు చెందిన 25 గేట్లలో 24 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1 లక్షా 35 వేల 768 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.

- రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ ప్లో 1 లక్షా 39 వేల 466 క్యూసెక్కులు ఉండటంతో అదికారులు వచ్చిన నీటిన వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు...ప్రాజెక్ట్ వద్ద 90 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories