జాతీయం:- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

జాతీయం:

- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు

- తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ వేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఇవాళ విచారణ .

- రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్త భాగాలను చేర్చారని ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు .

- ‘‘40వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు మార్చారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించేలా పథకాన్ని మార్చారు. ఏపీ ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్టంగా నివేదిక ఇచ్చింది’’ అని పిటిషనర్‌ ఆరోపణ

- దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెంకటరమణి స్పందిస్తూ... రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనని వివరణ.

- తమకు రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని తెలిపారు.

- కమిటీ నివేదిక కూడా ఏపీకి అనుకూలంగా ఉన్నందున కేసును ముగించాలని కోరారు.

- రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌ ద్వారా వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం

- తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని వివరణ.

- రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఖరేంటో వారం రోజల్లో తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశం.

- తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం వెల్లడి.

Show Full Article
Print Article
Next Story
More Stories