రఘురామకృష్ణంరాజు, నర్సాపురం... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి


అమరావతి రాజధానిగా ఉండాలి


సీఐర్డీఏ పేరు మాత్రమే మార్చామని మంత్రులు మాట్లాడడం పచ్చిదగా.


సీఆర్డీఎ అధికారాల ప్రకారం శాసనవ్యవస్థ, నాయ్యవ్యవస్థ,సచివాలయం ఉన్నచోట ప్లాట్లు ఇస్తామని రైతులతో అప్పుడు ఒప్పందం చేసుకొని ఇప్పుడు మాట మార్చడం పచ్చిదగా


రాజధాని కోసం రైతుల నుండి భూములు తీసుకుని , ఇప్పుడు పేదలకు పంచిపెడతామంటున్నారు.


పాలనావికేంద్రీకరణ, సీఆర్డీఎ చట్టం రద్దు న్యాయస్థానాలలో చెల్లదు.


అమరావతి రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్లు కేంద్రం మంజూరి చేసింది. కేంద్రం మూడు రాజధానుల కోసం నిధులు ఇస్తామనలేదు.


ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని అని విభజన చట్టంలో ఉంది .


రాజీనామాల బదులు, రాజధానికోసం రాజీలేని పోరాటం చేయాలని నేను పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నాను. శాసన సభ్యుల రాజీనామాలతో ప్రయోజనం లేదని జనసేన పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నాను.


ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా బదులు రాజీలేని పోరాటం చేయాలి. నాకులాగా రక్షణ కోసం కేంద్రం సహాయం కోరాల్సిఉంటుంది.


రాజధాని విషయంలో రిఫరెండం నిర్వహించడానికి సీఎం సిద్ధంగా లేడు. సాక్షి బదులుగా, మనసాక్షి నమ్మి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి.


విశాఖపట్నం రాజధానిగా చేస్తే.... రాయలసీమ ప్రజలు వ్యక్తిగత పనుల నిమిత్తం సుదూరం ప్రయాణించాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories