తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన పయ్యావుల కేశవ్

పయ్యావుల కేశవ్... తొలిసారి మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయాల్లో కేశవ్ కు మంత్రి పదవి దక్కలేదు. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ దఫా తెలుగుదేశంలో సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారు. మంత్రివర్గంలో కూడా కొత్తవారికి అవకాశం కల్పించారు. 2019-24 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా ఆయన కొనసాగారు.

ఈసారి చంద్రబాబు కేబినెట్ లో పయ్యావుల కేశవ్ కు అవకాశం దక్కింది. ఆర్ధిక శాఖ ఆయనకు దక్కింది. తొలిసారిగా ఆయన ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ టీ ఆర్ బతికున్న సమయంలో పయ్యావుల కేశవ్ కి 1994లో టీడీపీ టిక్కెట్టు లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు.1999 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన గెలిచారు.2014 ఎన్నికల్లో ఆయన ఓడారు. 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories