Amaravati Updates: టిడిపి సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్...

  అమరావతి

-పాల్గొన్న 175నియోజకవర్గాల టిడిపి ఇన్ ఛార్జ్ లు, ప్రజా ప్రతినిధులు

-చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పట్ల బాధ్యతగా టిడిపి వ్యవహరిస్తోంది.

-కరోనాతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉన్నాం.

-ఏపి ఫైట్స్ కరోనా వెబ్ సైట్ తో పేదలకు లబ్ది.

-కరోనా బాధితులను, దాతలను ఒకేవేదికపైకి తెచ్చి ఆదుకునే చర్యలు చేపట్టాం.

-అధికారంలో ఉండి వైసిపి బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది.

-వైసిపి అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతుకు రూ రూ 77,500 ఎగ్గొట్టారు.

-‘‘రైతు భరోసా’’ పేరుతో 5ఏళ్లలో ఒక్కో రైతుకు వైసిపి ప్రభుత్వం ఇచ్చేది రూ37,500మాత్రమే..

-అదే టిడిపి ప్రభుత్వం వచ్చివుంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5కిస్తీల కింద, ఒక్కో రైతుకు రూ లక్షా 15వేలు వచ్చేది..ఒక్కో రైతుకు రూ 77వేల పైగా   ఎగ్గొట్టి మీడియాలో గొప్పగా యాడ్స్ ఇవ్వడం వైసిపి నమ్మక ద్రోహం.

-ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ 4వేలకోట్లు ఇస్తామని రైతులను నమ్మించారు.

-అధికారంలోకి వచ్చాక మాట తప్పారు, మడమ తిప్పారు.

-ఇప్పుడు రూ 500 ఇస్తామని, వారం రోజులు నీళ్లలో ఇళ్లు మునిగితేనే రేషన్ ఇస్తామంటూ వరద బాధితులతో చెలగాటం ఆడుతున్నారు.

-ఇళ్ల స్థలాల పంపిణీ ఎన్నిసార్లు వాయిదాలు వేస్తారు..?

-వివాదాల్లేని ఇళ్ల స్థలాల పంపిణీకి ఎవరడ్డం పడ్డారు..?

-కోర్టులకు వెళ్లింది వైసిపి బాధితులైతే టిడిపిపై దుష్ప్రచారం చేయడం వైసిపి చేతగానితనం.

-ఇళ్ల స్థలాలకు మడ అడవులను నరికివేస్తారా..?

-15అడుగులలోతు ముంపు భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తారా..?

-కట్టిన ఇళ్లను, డిపాజిట్లు చెల్లించిన పేదలకు ఇవ్వరా...?

-ఏడాదిన్నరగా హవుసింగ్ పెండింగ్ బిల్లులు ఎందుకని నిలిపేశారు..?

-వైసిపి చేతగానితనానికి టిడిపిపై ఆడిపోసుకోవడం ఏమిటి..?

-చట్టాలను మీరు ఉల్లంఘిస్తూ టిడిపిపై కేసులు పెట్టడం ఏమిటి..?

Show Full Article
Print Article
Next Story
More Stories