Amaravati Updates: ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌..

 అమరావతి

- ‘వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం’ తో పాటు, ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి అక్టోబరు నెలలో సంభవించిన పంటల నష్టంపై పెట్టుబడి     సహాయం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) చెల్లింపు.

- క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌

- సీఎం జగన్ కామెంట్స్:

- ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం

- సీఎం స్ధానంలో మీ బిడ్డ కూర్చున్నాడు

- దేశంలో ఎవరూ చేయని విధంగా వారికి అండగా నిలబడుతున్నాం

- ఏ సమస్య వచ్చినా మీ బిడ్డగా తోడుగా ఉంటాను

- రైతులకు ఎంత చేసినా తక్కువే

- సకాలంలో రుణాలు చెలిస్తే ప్రభుత్వం వడ్డీ కడుతుంది

- ఆ నమ్మకాన్ని రైతుల్లో కల్పించాం, గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి భరోసా ఇవ్వలేదు.

- రైతులు, అక్కచెల్లమ్మలకు మరింత ఆదాయం వచ్చేలా అమూల్ ద్వారా పాలసేకరణ

- 3 జిల్లాల్లో ఈ నెల 26 నుంచి తొలిదశ పాలసేకరణ.

- రాష్ట్ర వ్యాప్తంగా 9800 బీఎంసీయూలు.‌

- ఆర్బీకేల పక్కనే బీఎంసీయూల నిర్మాణం 

Show Full Article
Print Article
Next Story
More Stories