వైసీపీ నేత కుమారుడి నకిలీ బాగోతం .. 11 కోట్ల టోకరా

విశాఖ: నకిలీ పట్టాలతో రూ.11 కోట్లకు ఒక బ్యాంక్ కు టోకరా వేసిన వైసీపీ నేత కుమారుడు

- వైఎ సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడు జీడి పిక్కల కమీషన్ వ్యాపారం

- ఓ బ్యాంకు నుంచి జీడిపి క్కల ఉత్పత్తిదారుల (రైతులకు) పేరిట నకిలీ పట్టాదారు పాస్ పుస్త కాలను సృష్టించి ఏకంగా రూ.11 కోట్లు కొల్లగొట్టాడు.

- విశాఖ జిల్లా గొలుగొండ మండలం ఏఎల్ పురానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత కుమారుడు జీడిపిక్కల కమీషన్ వ్యాపారం చేస్తున్నాడు.

- అనకాపల్లి లో ఒక గోదాము నిర్వహిస్తున్నాడు.

- ఈ నేపథ్యంలో 2017లో అనకాపల్లి లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ను సంప్రదించాడు.

- గొలుగొండ మండలంలో 16 మంది రైతులకు చెందిన జీడి పిక్కలు అనకాపల్లి గోదాములో నిల్వ ఉన్నట్లు చూపించి ఏకంగా రూ.11 కోట్ల రుణం తీసుకున్నాడు.

- ఇందులో సుమారు కోటి రూపాయలు వరకూ తిరిగి చెల్లించినట్లు సమాచారం

- మిగిలిన బకాయిలు చెల్లించకపోవడంతో జీడి పిక్కల గోదామును సీజ్ చేశారు.

- అంతేకా కుండా, రుణ మంజూరుకు తనఖాగా పెట్టిన 16 మంది రైతుల పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను గొలుగొండ మండల రెవెన్యూ కార్యాలయానికి ఇటీవల పంపారు.

- క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక అందించాలని కోరారు

- వీఆర్వోలు రెండు మూడు రోజులుగా పాతమల్లంపేట, ఏఎల్ పురం, కృష్ణదేవిపేట గ్రామంలో పర్యటించారు.

- రైతులను కలిసి విచారణ జరిపారు

- పట్టాదారు పాస్ పుస్తకాల్లో నమోదైన పేర్లు, సర్వే నంబర్లు, రెవెన్యూ గ్రామలకు పొంతన లేదని గుర్తించారు.

- అనకాపల్లి బ్యాంకులో తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని రైతులు చెప్పినట్లు తెలిసింది.

- దీంతో సదరు వైసీపీ నేత కుమారుడి నకిలీ బాగోతం వెలుగు వచ్చింది

Show Full Article
Print Article
Next Story
More Stories