భక్తుల చెంతకే శ్రీవారి లడ్డు

విశాఖపట్నం: రెండు నెలల నుంచి శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేని కారణంగా... భక్తులంతా తల్లడిల్లిపోయారు. కలియుగ దైవంగా పూజలందుకొనే కోనేటి రాయుడి దర్శనం లేక బాధపడే భక్తులకు తితిదే అపురూపమైన అవకాశం కల్పిస్తోంది. సబ్సిడీ ధరకే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందిస్తోంది.విశాఖ తితిదే కల్యాణ మండపంలో శ్రీ వారి లడ్డు వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో భౌతిక దూరం పాటిస్తూ లడ్డులు అమ్మకం కొనసాగుతోంది. తిరుమల తిరుపతి వెళ్తే గాని దొరకని శ్రీవారి లడ్డును ఉత్తరాంధ్ర జిల్లాలకు అందించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ధన్యవాదాలు చెప్తున్నారు.లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ, లడ్డు అమ్మకాలు చేయడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డు అమ్మకాలకు వస్తున్న ఆదరణతో గడువు మరింత పెంచడానికి తితిదే ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు లడ్డు అమ్మకాలు కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు.



 


Show Full Article
Print Article
Next Story
More Stories