ఆ పార్టీ ప్రారంభం నుంచే నెహ్రూ కుటుంబ కబంధ హస్తాల్లో: కె కృష్ణసాగర రావు, బీజేపీ

బీజేపీ మీడియా స్టేట్మెంట్

కె కృష్ణసాగర రావు

ముఖ్య అధికార ప్రతినిధి, బీజేపీ, తెలంగాణ రాష్ట్రం. చే 

అనుకున్నట్టుగానే, కాంగ్రెస్ పార్టీ కుప్పకూలడానికి అంచుల్లో, చివరి దశలో ఉంది. కాంగ్రెస్ ఒక అప్రజాస్వామిక ఏర్పాటు అని చేస్తోన్న స్పష్టమైన ఆరోపణకు బీజేపీ కట్టుబడే ఉంది. ఆ పార్టీ ప్రారంభం నుంచీ నెహ్రూ కుటుంబ కబంధ హస్తాల్లోనే ఉంది.

సీడబ్ల్యూసీ సభ్యులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ, తాజా ఎంపీలు దాదాపు 23 మంది కలసి కాంగ్రెస్ పార్టీని ఆమూలాగ్రం సంస్కరించాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు. ఓ రకంగా కాంగ్రెస్ ను కుదిపేసే బహిరంగ పిలుపు ఇది.

కాంగ్రెస్ సీనియర్లు రాసిన ఈ లేఖ అంతర్లీనంగా, ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం మీద దాడే. అంతేకాదు, అది సోనియా రాజీనామాకు స్పష్టమైన డిమాండ్ కూడా. కాంగ్రెస్ అధ్యక్షులుగా కుటుంబం బయటి వ్యక్తే ఉండాలన్న ప్రియాంక వాద్రా తాజా ప్రకటన, ఈ లేఖకు ప్రభావమే.

ఒక జాతీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అనే మాట, ఆ ఆట ముగిసిపోయాయని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఆ పార్టీ వ్యవస్థాగత బలాన్ని కోల్పోయింది. అసలు దశాబ్ద కాలంగా చెప్పుకోదగ్గ, నడిపించదగ్గ సరైన నాయకత్వమే లేకుండా చుక్కాని లేని నావలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి.

కాంగ్రెస్ తన పతనానికి తన సొంత వ్యవస్థాగత నిర్మితిని తప్ప, మరెవరినీ బాధ్యులు చేయజాలదు.

Show Full Article
Print Article
Next Story
More Stories