వెదర్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

రాజారావు ఐఎండి డైరెక్టర్ @ హైదరాబాద్

నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి...

తెలంగాణ లో నిజామాబాద్ జిల్లాలోని నవిపేట లో అత్యధికంగా 17సెమీ వేల్పూరు 13సెమి, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ 14 సెమి ల భారీ వర్షపాతం వర్షపాతం నమోదైంది.

కోస్తాంధ్రలోని విజయనగరంలో 10 సెమి ,రాయలసీమ లోని గుంతకల్ లో 7సెమీ ల వర్షపాతం నమోదైంది..

ఈ అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణ జలాల్లో ఇవాళ ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉత్తర తెలంగాణ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు ,ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...

కోస్తాంధ్ర లో ఇవాళ తెలికాపాటి వర్షాలతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు,ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..

రాయలసీమ లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది..

ఆగస్టు 13 న మరో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది..

దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

నైరుతి రుతుపవనాల్లో తెలంగాణ లో సాధారణం కన్నా 16 శాతం ఎక్కువగా ,కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 24శాతం ఎక్కువగా,రాయలసీమ లో సాధారణం కన్నా 110 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories