విజయవాడ: మాణిక్యాలరావు మృతి.. బిజెపికి తీరని లోటు అంటూ సంతాపం బీజేపీ నేతలు
- వర్చువల్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి సంతాప సభలో పాల్గొన్న నేతలు
- సోము వీర్రాజు:
మాణిక్యాలరావు.. ఎంత ఎదిగినా.. తన నమ్మిన సిద్దాంతాల కోసం పని చేశారు
- మృదుస్వభావి... కోపం వచ్చినా.. వెంటనే.. మళ్లీ మాములు అయిపోయేవారు
- దేవాదాయశాఖ మంత్రిగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని.. పని చేశారు
- అభివృద్ది విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడకుండా.. పని చేసేవారు
1989 నుంచి బీజేపీ లోనే ఉంటూ.. పార్టీ అభివృద్ది కోసం పని చేశారు.
- ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ,పార్టీకి తీరని లోటు
కన్నా లక్ష్మీనారాయణ:
పార్టీలో ఇటువంటి సంఘటన వస్తుందని కలలో ఊహించలేదు
పార్టీలో నిబద్దత కోసం పని చేసిన నాయకుడు మాణిక్యాలరావు
తాడేపల్లి గూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, దేవాదాయశాఖ మంత్రిగా పని చేస్తూనే.. పార్టీ ప్రధాన కార్యదర్శి గా బీజేపీ అభివృద్ది కోసం పని చేశారు
తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులు, నియోజకవర్గ అభివృద్ది కోసం తపన పడుతుండేవారు
మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిని సైతం ఎదిరించి అమిత్ షా సహకారంతో నిట్ ను తన నియోజకవర్గంలో కేటాయించుకున్నారు
దేవాలయాల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు
నేను అధ్యక్షునిగా ఉన్న సమయంలో.. ప్రధాన కార్యదర్శిగా.. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా కాదనకుండా పని చేశారు
బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికల బాధ్యతలను పూర్తి చేశారు
లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా.. పార్టీ అప్పచెప్పిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు
సురేష్ ప్రభు:
మాణిక్యాలరావు వంటి మంచి మనిషిని పార్టీ కోల్పోవడం బాధాకరంట
నాకు ఎంతో ఆత్మీయుడు.. ఎన్నో విషయాలను చర్చించకున్నాం
పార్టీ పట్ల నిబద్దత.. విలువలను పాటిస్తూ పని చేసి నాయకులు
చివరి సారిగా ఆయన కలిసిన సమయంలో రాజకీయ అంశాలపై చర్చించాం
మంత్రి స్థాయికి ఎదిగినా.. ఎప్పుడూ సామాన్య కార్యకర్తగానే పార్టీలో పని చేశారు
వాళ్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియ చేస్తున్నాను
మురళీధర్ రావు:
ఎపీలో అనేక ఆటుపోటులు ఎదుర్కొని మాణిక్యాలరావు బీజేపీ కోసం పని చేశారు
మంత్రి పదవి కన్నా విలువలే మఖ్యమని, రాజీనామాకు సిద్దమని ప్రకటించిన నాయకులు
బీజేపీ కార్యకర్త ఎలా ఉండాలా అని చెప్పేందుకు మాణిక్యాలరావు జీవితాన్ని ఉదహరించాలి
పార్టీ కోసం పని చేస్తూ ఆదర్శంగా నిలిచేలా ఆయన పని చేశారు
సాధారణ జీవితం, ఉన్నతమైన లక్ష్యాల కోసం మాణిక్యాలరావు పని చేశారు.
బీజేపీ కేంద్ర పార్టీ మాణిక్యాలరావుకు ఇచ్చిన కానుక NIT అని నేను భావిస్తున్నాను
బీజేపీ ని ఎపీలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పని చేశారు.
అనేక రాష్ట్రాలలో బీజేపీ బలపడుతున్న విధంగా.. అదే విజయాన్ని ఎపీలో
సాధించాలని ఆయన భావించారు
అది సాధించడం ద్వారానే ఎపీలో గ్రామ స్థాయిలో ఉండే చివరి కార్యకర్త మాణిక్యాలరావుగారికి శ్రద్దాంజలి ఘటిస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలి
కిషన్ రెడ్డి
మాణిక్యాలరావు.. పార్టీలో కీలకపాత్ర, చురకైన పాత్ర పోషించే వారు
వర్చ్యువల్ విధానం ద్వారా కార్యక్రమం జరుపుకోవాల్సి రావడం దురదృష్టకరం
జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తూ... క్రమశిక్షణకు ప్రతిబింబగా మాణిక్యాలరావు నిలిచారు
ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా.. నేను వైద్యులతో మాట్లాడి ఆరా తీశాను
ఎలా అయినా ఆయన్ను కాపాడేందుకు కృషి చేయాండి.. అన్నివిధాలా మేము అండగా ఉంటామని వైద్యులకు చెప్పాను
కానీ దురదృష్టవశాత్తు ఆయన మన నుంచి దూరమవడం బాధ కలిగించింది
చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ది జరుగుతుందని మాణిక్యాలరావు చెబుతుండే వారు
మాణిక్యాలరావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి
ఆయన్ను స్పూర్తిగా తీసుకుని.. ప్రజలకు, సమాజానికి పని చేయాలి
మాణిక్యాలరావు సిద్దాంతాలను ముందుకు తీసుకెవళ్లడమే..ఆయనకు మనం ఇచ్చే నివాళి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire