కోవిడ్‌ పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

అమరావతి: కోవిడ్‌ నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 8.87శాతం, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8.56శాతం

మరణాల రేటు దేశంలో 2.07శాతం, ఏపీలో 0.89శాతం

ప్రతి పదిలక్షల మందిలో 43,059 మందికి పరీక్షలు

శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరులో రాష్ట్రం సగటుకన్నా ఎక్కువ పరీక్షలు

సమీక్ష లో ముఖ్యాంశాలు 

రాష్ట్రంలో పరీక్షలు బాగా చేస్తున్నాం

చేస్తున్న పరీక్షల్లో 85 శాతం నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నాం

104, 14410 కాల్‌ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలి

ఈ రెండు నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

ప్రజలు కాల్‌ చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి

139 ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో భోజనం , పారిశుద్ధ్యంపై సీఎం ఆరా

మెనూ కచ్చితంగా అమలు చేసేలా చూస్తున్నామన్న అధికారులు

దీనివల్ల నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తోందన్న అధికారులు

ఎప్పటికప్పుడు వస్తున్న లోపాలను సరిదిద్దుకోవాలి

ఎదురవుతున్న లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం

అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి

స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు మాస్కులు ఇవ్వాలి

జగనన్న విద్యాకానుక ఇచ్చే సమయానికి మాస్కులు ఇవ్వాలి

కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలపైన ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న సీఎం

ఆయా అంశాల్లో సేవలు ఎలా ఉన్నాయన్న దానిపై పీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న సీఎం

గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు పెట్టాలి

ఆరోగ్య శ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలి

ఏఎన్‌ఎం ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా ఉండాలి

కోవిడ్‌ ఆస్పత్రుల వివరాలు ఈ పోస్టర్‌లో ఉండాలి

వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై ఏఎన్‌ఎం తగిన విధంగా మార్గనిర్దేశం చేయాలి

దీంట్లో వాలంటీర్‌ భాగస్వామ్యంకూడా ఉండాలి

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్దా కోవిడ్‌ సోకిందని అనిపిస్తే ఏంచేయాలన్నదానిపై హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలి

కోవిడ్‌ ఉన్నట్టుగా అనుమానం ఉంటే.. ఏంచేయాలన్నదానిపై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి

కోవిడ్‌ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోండి

ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలి

Show Full Article
Print Article
Next Story
More Stories