రాష్ట్ర వైద్య శాఖ మంత్రి అళ్ల నాని కామెంట్స్ ...

కడప :

- జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సమీక్ష నిర్వహించాము..

- నివారణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు పై అధికారులతో సమీక్ష..

- కోవిద్ హాస్పిటల్ లో ఏర్పాట్లు, భోజనాలు ఇతర స్యానిటేషన్ పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం...

- ప్రతి రోజు జిల్లాలో 4500 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం...

- రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు...

- పారదర్శకంగా వీలైనన్ని కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం...

- కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు వారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ...

- కరోనా రోగులకు అందిస్తున్న భోజన నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తప్పవు...

- నాణ్యత లేకుండా ఆహారాన్ని సరఫరా చేస్తే కాంట్రాక్ట్ రద్దుతో పాటు సంబంధిత అధికారులు పై చర్యలు...

- దేశంలో నే అత్యధిక శాతం లో కరోనా టెస్టులు చేస్తున్నాం...

- అందుకే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి...

- కరోనా నివారణకు ఎంత ఖర్చు అయినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది...

- జిల్లాలో ఇప్పటి వరకు 1080 బెడ్లు అందుబాటులో ఉన్నాయి... దీనికి అదనంగా300 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచడం జరిగింది..

- నాన్ కోవిడ్ కేర్, కోవిద్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం..

- 1000మంది నూతన వైద్య సిబ్బందిని వారం రోజుల లోపు తీసుకొనున్నాం...

- స్టాఫ్ నర్సులు, నర్సులు, ఎఫ్ ఎన్ ఓ లను రిక్రూట్ చేస్తున్నాం..

- కరోనా నివరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ప్రజలు కూడా సహకారాన్ని అందించాలి...

- ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు...దీనిపై అపోహలు వద్దు...

- ప్లాస్మా దానం ద్వారా అపాయాంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన వారు అవుతారు...

- ప్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సహకంగా 5 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది...

- ఇది వరకు ఇచ్చిన సహకారాన్ని ప్రజలు కూడా కరోనా నివారణకు సహకరించాలి...

- కరోనా పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది..

- నెలకు 350 కోట్ల రూపాయలను కరోనా నివారణకు ఖర్చు చేస్తున్నాం...

- ప్రజల ఆరోగ్యం కన్నా డబ్బులు ముఖ్యం కాదన్న సంకల్పంతో సిఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు...

Show Full Article
Print Article
Next Story
More Stories