ఏపీకి ఇదో శుభ‌ప‌రిణమం: ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

తూర్పు గోదావరి: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మూడు రాజధానులు బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడం శుభపరిణామమని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు

- శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేస్తూ, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ బిల్లును తీసుకో వచ్చిందన్నారు.

- ఈ బిల్లుపై రాష్ట్ర గవర్నర్ సమగ్రంగా పరిశీలించి, వివిధ వర్గాలతో చర్చించి, న్యాయపరమైన సలహాలు తీసుకుని బిల్లును ఆమోదించడం జరిగిందన్నారు.

- రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.

- మూడు రాజధానులు బిల్లు ఆమోదంపై రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు.

- అమరావతిని అడ్డంగా పెట్టుకుని చంద్రబాబు అండ్ కో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని తీవ్రంగా విమర్శించారు.

- రాజధాని ప్రాంతంలో 30 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన భూములను 3 కోట్ల రూపాయలు విక్రయించుకున్నారని,

- ఎకరం పది కోట్ల రూపాయల విలువ పెంచేందుకే చంద్రబాబు బినామీల చే ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు.

- రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు త్రయం సృష్టిస్తున్న అడ్డంకులు ఎంతోకాలం నిలబడవన్నారు.

- అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు కు గుణపాఠం చెప్పినప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories