పీసీఐ అనుమతి లేకుండా జర్నలిస్టుల పై కేసులొద్దు..!

న్యూఢిల్లీ: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) లేదా ఇతర జ్యుడీషియరీ అథారిటీ అనుమతి లేకుండా జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం తగదని, ఈ మేరకు ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వాలని కోరుతూ అడ్వొకేట్‌ ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు..

- సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తుల బండారం బయటపెడుతున్న న్యూస్‌ చానళ్లను కొందరు లక్ష్యంగా చేసుకుంటున్నారని, పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు..

- రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి, జీ న్యూస్‌ ఎడిటర్‌ సుధీర్‌ చౌదరిపై ఇలాగే కేసులు పెట్టారని గుర్తుచేశారు. జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటే పీసీఐ అనుమతిని తప్పనిసరి చేయాలని కోరారు..

- ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు..

Show Full Article
Print Article
Next Story
More Stories