కోవిడ్ రిలీఫ్ కిట్లు పంపిణీ

పొన్నూరు: నేటి సమాజంలో మానవులకు ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ జబ్బును ఎదుర్కొని జీవించడంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ డి.పద్మనాభుడు అన్నారు.

- శుక్రవారం మండలపరిధిలోని నండూరు గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో సేవాభారత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 రిలీఫ్ కిట్లను పంపిణీ చేశారు.

- సేవా భారత్ వారు ప్రస్తుత పరిస్థితిలో అందిస్తున్న సేవలు స్ఫూర్తి దాయకమని తహశీల్దార్ కొనియాడారు.

- ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ... సేవా భారత్ స్వచ్ఛంద సంస్థ గ్రామములో నిరుపేదలను గుర్తించి వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

- మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రభుత్వం తరఫున తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

- అలానే మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు.

- అనంతరం గ్రామములోని నిరుపేదలైన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

- ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories