Biryani: సెకనుకు మూడు బిర్యానీ ఆర్డర్లు.. టాప్ లో హైదరాబాద్ సిటీ..

Zomato Released its Year-end Report for 2024
x

Zomato Report: సెకనుకు మూడు బిర్యానీ ఆర్డర్లు.. టాప్ లో హైదరాబాద్ సిటీ..

Highlights

Zomato 2024 Report: ప్రతి సెకనుకు మూడు బిర్యానీ ఆర్డర్లను జొమాటో (Zomoto)డెలివరీ చేసింది.

Zomato 2024 Report: ప్రతి సెకనుకు మూడు బిర్యానీ ఆర్డర్లను జొమాటో (Zomoto)డెలివరీ చేసింది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా జొమాటో డెలివరీ చేసిన ఆర్డర్లలో బిర్యానీ(Biryani) టాప్ లో నిలిచింది. దేశవ్యాప్తంగా 2024 ఏడాదిలో ఆ సంస్థ 9 కోట్ల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన రిపోర్ట్ ను ఆ సంస్థ విడుదల చేసింది.

ఇక స్విగ్గీలోనూ(Swiggy) కూడా బిర్యానీ ఆర్డర్లే టాప్ లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు స్విగ్గీ కి దేశవ్యాప్తంగా వచ్చిన ఆర్డర్లను ఆ సంస్థ ప్రకటించింది. నిమిషానికి 158 బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయి.సెకనుకు రెండు బిర్యానీ ఆర్డర్లు తమకు అందాయని ఆ సంస్థ తెలిపింది. 83 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. రైల్వేతో స్విగ్గీ ఒప్పందం ఉంది. రైల్వే ప్రయాణీకులకు స్విగ్గీ ఆహారపదార్ధాలను సరఫరా చేస్తోంది.చికెన్ బిర్యానీ కోసం 49 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి.

బిర్యానీ ఆర్డర్ లో హైదరాబాద్ టాప్

ఇక బిర్యానీల కోసం ఆర్డర్ చేసిన సిటీల్లో హైదరాబాద్(Hyderabad) టాప్ లో నిలిచింది. 9.7 మిలియన్ల మంది బిర్యానీ కోసం ఆర్డర్ చేశారు. 7.7 మిలియన్లతో ఆ తర్వాతి స్థానంలో బెంగుళూరు(Bengulurur) నిలిచింద4.6 మిలియన్లతో చెన్నై(Chennai) మూడో స్థానంలో నిలిచింది.ఇక మటన్ బిర్యానీ ఆర్డర్ లో కూడా హైదరాబాద్ టాప్ లో ఉంది.

2.2 మిలియన్ల మంది ఈ బిర్యానీ కోసం ఆర్డర్ చేశారు.ఇక రంజాన్ నెలలో ఆరు మిలియన్ ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేశారు. కొత్తగా 2.8 మిలియన్ల మంది కొత్తగా బిర్యానీ కోసం ఆర్డర్లు పెట్టారు.రాత్రి 12 నుంచి రెండు గంటల మధ్య చికెన్ బర్గర్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. 1.84 మిలియన్ల బర్గర్లను ఆర్డర్ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

బిర్యానీ తర్వాత పిజ్జా ఆర్డర్లు

బిర్యానీ తర్వాత పిజ్జాను ఎక్కువమంది ఆర్డర్ చేశారు. మొత్తం 5.84 కోట్ల పిజ్జాలు డెలివరీ చేసినట్టు జొమాటో ప్రకటించింది. 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కప్పుల కాఫీని కూడా జొమాటో వినియోగదారులకు అందించింది. దిల్లీకి చెందిన ఒకరు 250 ఉల్లిగడ్డ పిజ్జాలను ఆర్డర్ చేశారు.

ఇక స్విగ్గీలో మసాలా దోశ కోసం ఆర్డర్లు బిర్యానీ తర్వాత ఎక్కువగా ఉన్నాయి. 23 మిలియన్ల మంది మసాలా దోశ కోసం ఆర్డర్ చేశారు. 8.5 మిలియన్ దోశలు, 7.8 మిలియన్ల ఇడ్లీలను బ్రేక్ ఫాస్ట్ కోసం స్విగ్గీ ఆర్డర్ చేసింది. బెంగుళూరు వాసులు ఎక్కువగా మసాలా దోశ కోసం ఆర్డర్ చేశారని స్విగ్గీ డేటా వెల్లడించింది. ఇక దిల్లీ, చండీగడ్, కోల్ కతా వాసులు ఆలు పరోట, కచోరి కోసం ఎక్కువగా ఆర్డర్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories