Zomato: జొమాటోలో 'ఫుడ్‌ రెస్క్యూ' ఫీచర్‌.. సగం ధరకే ఫుడ్..

Zomato Launches New Food Resuce Feature, Know how This Features Works
x

Zomato: జొమాటోలో 'ఫుడ్‌ రెస్క్యూ' ఫీచర్‌.. 

Highlights

Zomato: ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ సేవలు రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా డెలివరీ యాప్స్‌ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి.

Zomato: ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ సేవలు రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా డెలివరీ యాప్స్‌ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. జొమాటో ఫుడ్‌ రెస్క్యూ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇంతకీ ఏంటీ ఫీచర్‌.? దీని ఉపయోగం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఏదైనా ఫుడ్‌ను ఆర్డర్‌ చేస్తాం. కానీ అనుకోని కారణాల వల్ల చివరి క్షణంలో ఆ ఫుడ్‌ను క్యాన్సల్‌ చేయాల్సి వస్తుంది. అయితే ఫుడ్‌ ఆర్డర్‌ చేశాక క్యాన్సిల్‌ చేస్తే రీఫండ్‌ చెల్లించమనే నిబంధన ఉన్న సమయంలో కూడా ఫుడ్‌ ఆర్డర్‌ క్యాన్సలేషన్‌లు పెరుగుతున్నాయి. నెలకు ఇలా దాదాపు నాలుగు లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. దీంతో ఫుడ్‌ వెస్టేజ్‌ ఎక్కువుతోంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగానే ఈ ఫుడ్‌ రెస్క్యూ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

ఈ ఫీచర్‌ సహయంతో.. ఒకవేళ ఎవరైనా యూజర్ ఫుడ్‌ ఆర్డర్‌ను క్యాన్సల్‌ చేసిన వెంటనే సదరు వ్యక్తి అడ్రస్‌కు సమీపంలో ఉన్న కస్టమర్లకు అలర్ట్‌ వెళ్తుంది. క్యాన్సిల్‌ చేసిన ఆ ఫుడ్‌ డిస్కౌంట్‌తో పొందే అవకాశం లభిస్తుంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు యాప్ లో పాప్ అప్ వస్తుంది. తక్కువ ధరకే సదరు ఫుడ్‌ను కొనుగోలు చేయొచ్చన్నమాట. ఆ మొత్తం అమౌంట్ రెస్టారెంట్ పార్ట్నర్ కే అందుతుంది.

అయితే ఈ ఫీచర్‌ ఐస్ క్రీమ్స్, షేక్స్, స్మూతీస్ వంటి మెల్ట్‌ అయ్యే ఫుడ్స్‌కు వర్తించదు. డెలివరీ లొకేషన్ చేంజ్ అయినా.. పికప్ నుంచి డ్రాప్ ఆఫ్ వరకూ ఏజెంట్లు తగిన పరిహారాన్ని పొందుతారు. ఈ రకంగా కొంతమేర ఆహార వృథాను అరికట్టవచ్చని దీపిందర్ వివరించారు. అయితే ఈ ఆఫర్ లిమిటెడ్ టైం వరకే ఉంటుంది. 7 నిమిషాల్లోపు ఎవరూ కొనకపోతే.. ఆఫర్ ఎక్స్పైర్ అవుతుంది. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories