Save Income Tax: కొత్త కారు కొంటున్నారా.. రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు..!

You can Save Income Tax up to Rs.1.50 lakh by Buying a New Car Follow this Method
x

Save Income Tax: కొత్త కారు కొంటున్నారా.. రూ.1.50 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు..!

Highlights

Save Income Tax: కొత్త కారు కొనడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు జీతం తీసుకునే వ్యక్తి అయితే మీ అతిపెద్ద టెన్షన్ ఆదాయపు పన్ను ఆదా చేయడంపైనే ఉంటుంది.

Save Income Tax: కొత్త కారు కొనడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు జీతం తీసుకునే వ్యక్తి అయితే మీ అతిపెద్ద టెన్షన్ ఆదాయపు పన్ను ఆదా చేయడంపైనే ఉంటుంది. కొత్త కారు కొనుగోలుపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలో ఇలాంటి మినహాయింపులు ఉన్నాయి. కొత్త కారు కొనడం నుంచి కారు అద్దెకు తీసుకోవడం వరకు రెండు ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

కొత్త కారుపై పన్ను ఆదా

కొత్త కారుపై పన్ను ఆదా చేయాలంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 EEB మీకు సహాయం చేస్తుంది. ఈ నిబంధన మీకు వ్యక్తిగత వినియోగం కోసం తీసుకున్న కారుపై రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపును అందిస్తుంది. మీరు కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తే, రూ.1.50 లక్షల వరకు ఆటో రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఆదాయపు పన్నులో ఈ నిబంధన కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆదాయపు పన్ను చట్టంలో ఈ నిబంధన చేర్చింది.

అద్దె కారుపై పన్ను ఆదా

అద్దె కారుపై కూడా ఆదాయపు పన్ను మినహాయింపును పొందవచ్చు. అధిక పన్ను పరిధిలోకి వస్తే ఈ ఎంపిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు కార్ లీజు ఫైనాన్స్ ఆప్షన్‌ను అందిస్తాయి. ఈ ఆప్షన్‌ సాధారణంగా అధిక జీతం తీసుకునే ఉద్యోగులకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కంపెనీ కారును ఉద్యోగికి లీజుకు ఇస్తుంది. తరువాత కంపెనీ లీజు అద్దె, మెయింటనెన్స్‌, కారు డ్రైవర్ జీతంపై చేసిన ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది. అనగా దానిని ఉద్యోగికి తిరిగి ఇస్తుంది. ఇది అతని జీతంలో భాగం కాదు అతను దానిపై ఆదాయపు పన్ను నుంచి ఉపశమనం పొందుతాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories