US Fed cuts: అమెరికాలో వడ్డీ రేట్లలో మార్పులు భారత స్టాక్ మార్కెట్‌పై ఎలా ప్రభావం చూపుతాయి?

US Fed cuts: అమెరికాలో వడ్డీ రేట్లలో మార్పులు భారత స్టాక్ మార్కెట్‌పై ఎలా ప్రభావం చూపుతాయి?
x
Highlights

Why US Fed cuts are impacting stock market in india: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై...

Why US Fed cuts are impacting stock market in india: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. అమెరికాలో వడ్డీ (US Fed Cuts) రేట్లలో మార్పులు భారత స్టాక్ మార్కెట్‌పై (Indian Stock Market) ఎందుకు ప్రభావం చూపిస్తాయి? దీని కారణం ఏంటి? ఓసారి తెలుసుకుందాం.

భారత్‌లో విదేశీయుల పెట్టుబడులు

విదేశీయులు భారత్‌లో పెట్టుబడి పెడుతుంటారు. భారత్ అభివృద్ది చెందుతున్న దేశం. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఎక్కువ. అమెరికాతో పోలిస్తే ఇండియాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. విదేశీయులు తమ దేశాల్లో తక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని భారత్‌లో పెట్టుబడి పెడతారు. భారత్‌లో పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. ఈ కారణాలతో విదేశీయులు భారత్‌లో పెట్టుబడులు పెడతారు.

అమెరికాలో వడ్డీ రేట్ల మార్పులతో భారత్ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం

అమెరికాలో వడ్డీ రేట్లలో మార్పులు ప్రపంచంలోని పలు దేశాలపై ప్రభావం చూపుతాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని ఉపసంహరించుకుంటారు. వడ్డీరేట్లు పెరిగితే బాండ్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ కంటే ఇవి మరింత సురక్షితమైనవి. వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ బలపడుతుంది. దీని ప్రభావం రూపాయి విలువ పడిపోవడానికి కారణమౌతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories