Indian Railway Facts: రైల్వే ట్రాక్‌పై కంకర కచ్చితంగా అవసరం.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Why Stones are Laid on the Railway Track Know the Real Reason
x

Indian Railway Facts: రైల్వే ట్రాక్‌పై కంకర కచ్చితంగా అవసరం.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Highlights

Indian Railway Facts: రైల్వే ట్రాక్‌పై కంకర కచ్చితంగా అవసరం.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Indian Railway Facts: రైలు ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా, చౌకగా ఉంటుంది. ప్రతిరోజు లక్షల మంది ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రైలులో ప్రయాణిస్తారు. మీరు కూడా ఏదోఒక సమయంలో రైలులో ప్రయాణించే ఉంటారు. అయితే రైలు పట్టాలని ఒక్కసారి గమనిస్తే అక్కడ మొత్తం కంకర కనిపిస్తుంది. వాస్తవానికి ఈ కంకర ట్రాక్‌పై ఎందుకు పోశారో ఎప్పుడైనా గమనించారా.. నిజానికి ఒక ప్రత్యేక అవసరం కోసం కంకర పోస్తారు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

రైల్వే ట్రాక్‌పై రాళ్లని వేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే.. ట్రాక్ కింద పొడవైన ప్లేట్లు ఉంటాయి. వీటినే స్లీపర్స్ అని పిలుస్తారు. వీటికింద చిన్న చిన్న రాళ్లు ఉంటాయి. వీటిని బ్లాస్ట్ అంటారు. వాటి కింద రెండు పొరల మట్టి ఉంటుంది. రైల్వే ట్రాక్ భూమి కంటే కొంచెం ఎత్తుగా కనిపించడానికి ఇదే కారణం. రైలు ట్రాక్‌పై కదులుతున్నప్పుడు ఈ రాళ్లు, స్లీపర్‌లు, బ్లాస్టర్‌లు రైలు బరువును మెయింటెన్‌ చేయడానికి పని చేస్తాయి.

రెండో కారణం ఏంటంటే.. రైలు ట్రాక్‌పై కదులుతున్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ ఏర్పడుతుంది. ఈ పదునైన రాళ్లు వైబ్రేషన్ కారణంగా ట్రాక్‌ను జరగకుండా ఆపుతాయి. ఈ రాళ్లు రౌండ్‌గా ఉంటే కంపనాలు ఆగవు.. ట్రాక్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే పదునైన రాళ్లని ట్రాక్‌పై పోస్తారు. ఇవి స్లీపర్‌లను గట్టిగా ఉంచుతాయి. దీంతో పాటు రైల్వే ట్రాక్ పై రాళ్లు వేయడం వల్ల ట్రాక్ పై కలుపు మొక్కలు, ఎలాంటి గడ్డి పెరగకుండా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories