పెరిగిన ఉల్లి, మాంసం ధరలు:డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందంటే ?

Wholesale inflation reached 2.37 percent in December 2024
x

Inflation : పెరిగిన ఉల్లి, ఆలు, మాంసం ధరలు: డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందంటే ? 

Highlights

డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గి కాస్త ఊరట అనిపించినప్పటికీ, టోకు ద్రవ్యోల్బణం మాత్రం పెరుగుదలను చూసింది.

Inflation : డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గి కాస్త ఊరట అనిపించినప్పటికీ, టోకు ద్రవ్యోల్బణం మాత్రం పెరుగుదలను చూసింది. హోల్‌సేల్ మార్కెట్లలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, మాంసం, చేపలు మొదలైన వాటి ధరలు పెరిగాయి. మరోవైపు, తయారీ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. దీని కారణంగా డిసెంబర్ 2023, నవంబర్ 2024 తో పోలిస్తే టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల కనిపించింది. టోకు ద్రవ్యోల్బణానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి గణాంకాలు సమర్పించిందో చూద్దాం.

టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల

తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా డిసెంబర్ 2024లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2.37 శాతానికి పెరిగింది. అయితే, ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. నవంబర్ 2024లో WPI(Wholesale price inflation ) ఆధారిత ద్రవ్యోల్బణం 1.89 శాతంగా ఉంది. డిసెంబర్ 2023లో ఇది 0.86 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం డిసెంబర్ 2024లో 8.47 శాతానికి తగ్గింది. అయితే నవంబర్‌లో ఇది 8.63 శాతంగా ఉంది. నవంబర్‌లో 28.57 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 28.65 శాతానికి చేరుకుంది.

బంగాళాదుంప ద్రవ్యోల్బణంలో ఎటువంటి తగ్గుదల లేదు. అది 93.20 శాతం గరిష్ట స్థాయిలోనే ఉంది. ఉల్లిపాయ ధరల ద్రవ్యోల్బణం కూడా పెరిగి డిసెంబర్‌లో 16.81 శాతానికి చేరుకుంది. డిసెంబర్ నెలలో ధాన్యాలు, పప్పు ధాన్యాలు, గోధుమలు వంటి ఆహార పదార్థాల ధరలు తగ్గడం ఉపశమనం కలిగించే విషయం. ఇంధనం , విద్యుత్ ధరల ద్రవ్యోల్భణం డిసెంబర్ నెలలో తగ్గుదల కనిపించింది. రెండింటికీ ద్రవ్యోల్బణం 3.79 శాతానికి తగ్గింది. ఇది నవంబర్‌లో 5.83 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల ధరలలో పెరుగుదల ఉంది. కాకపోతే ఈ పెరుగుదల చాలా స్వల్పంగా ఉంది. డిసెంబర్‌లో దాని ద్రవ్యోల్బణం 2.14 శాతంగా ఉండగా, నవంబర్‌లో ఇది 2 శాతంగా ఉంది.

డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయి 5.22 శాతానికి తగ్గింది. నవంబర్‌లో ఇది 5.48 శాతంగా ఉంది. సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ డేటా నుండి ఈ సమాచారం అందింది. వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.48 శాతంగా ఉండగా, డిసెంబర్ 2023లో 5.69 శాతంగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక (CPI) డేటా ప్రకారం.. డిసెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.39 శాతానికి తగ్గింది. ఇది నవంబర్‌లో 9.04 శాతంగా, డిసెంబర్ 2023లో 9.53 శాతంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories